MLC VENKTRAMI REDDY: రాజ్ పుష్ప బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థల భాగస్వామి, మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంట్రామిరెడ్డికి మెదక్ ఎంపీ సీటుని ఖరారు చేసింది BRS అధిష్టానం. వివాదాస్పద మాజీ IAS అధికారి ఆయన ఈయన.. కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. BRSకు అతి పెద్ద ఫండ్ రైజర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు వెంకటరామిరెడ్డి. ఉద్యోగంలో ఉండగానే కెసిఆర్.. ఆయన చేత రాజీనామా చేయించి ఎమ్మెల్సీ కట్టబెట్టారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు వాళ్ల దగ్గర పనిచేసిన వెంకటరామిరెడ్డి.. కేవీపీ రామచంద్రరావుకి అత్యంత సన్నిహితుడు కూడా.
Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..
కేసీఆర్ సీఎం అయ్యాక వెంకటరామిరెడ్డి హవా మరింత పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణలో, నిర్మాణంలో వెంకటరామిరెడ్డి కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన వందల ఎకరాలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వెంకటరామిరెడ్డికి ఐదుగురు అన్నదమ్ములు. రియల్ ఎస్టేట్ రంగంలో తన తమ్ముళ్లను ప్రవేశపెట్టి.. తాను ప్రభుత్వ అధికారిగా ఉండి వ్యవహారం నడిపించారని ఆరోపణలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వెంకటరామిరెడ్డి ఇంటిపై, రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. కేసీఆర్ కుటుంబానికి ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక వనరులు సమకూర్చే బిగ్ హ్యాండ్‌గా వెంకట్రామిరెడ్డి పాపులర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ అవగానే రెవెన్యూ మంత్రిని చేస్తారని బాగా వినిపించింది. కానీ ఎన్నికల హడావిడిలో ఆ విషయాన్ని అప్పట్లో పక్కన పెట్టారు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ వెంకటరామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మెదక్ జిల్లా టోపోగ్రఫీ మీద బాగా పట్టున్న వెంకటరామిరెడ్డిని అక్కడ ఎంపీగా నిలబెట్టాలని కెసిఆర్ డిసైడ్ అయ్యారు. ఆర్థికంగా చాలా బలమైన శక్తి కలిగిన వెంకటరామిరెడ్డికి రూపాయి ఇవ్వక్కర్లేదు.
BJP CHANDRASEKHAR: చంద్రశేఖర్ మ్యాజిక్‌తో.. బీజేపీ లీడర్లు సెట్ అవుతారా..?
ఆయనే ఖర్చు పెట్టుకుంటాడు. అందువల్ల మెదక్ ఎంపీ సీటుకు అన్ని విధాలా ఆయనే మంచి అభ్యర్థి అని కెసిఆర్, కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు కేసీఆర్ కాళ్ళపై పడి వివాదాస్పదమయ్యారు వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాత BRSకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ కలెక్టర్ హోదాలో ప్రజలను బెదిరించి మరోసారి కాంట్రవర్సీ అయ్యారు. ఎన్నికలకు ముందు కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలకు వేలంలో పాడటం ద్వారా రాజపుష్ప సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కేటీఆర్ ఆదేశాలపైనే ఆనాడు ఎకరం 100 కోట్ల రూపాయలకు కొన్న వెంకట్రామిరెడ్డి.. హైదరాబాదులో ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించారని విమర్శలు ఉన్నాయి. కేటీఆర్, వెంకటరామిరెడ్డి ఇద్దరు కుమ్మక్కై హైదరాబాదులో భూములు విలువ పెంచడానికి ఇలాంటి కుట్ర చేశారని అప్పట్లో పార్టీలన్నీ విమర్శించాయి. ఏదేమైనా కెసిఆర్‌ని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నారు. మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ మాజీ IAS అధికారి వెంకట్రామిరెడ్డి పోటీలో దిగితే ఎన్నిక మంచి రసవత్తరంగా మారనుంది.