దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (National General Elections) ప్రచారం ముగిసింది. ఇక ఏ రాజకీయ నాయకుడు గానీ బహిరంగం వచ్చి ప్రసంగాలు ఇవ్వకుడాదు..ఎవరికి వారు ఇంటి గొల్లం పెట్టుకున్నట్లు.. స్వతంత్రంగా హౌస్ అరెస్ట్ అవ్వాల్సిందే అని చెప్పవచ్చు. తాజాగా నిన్న ఎన్నికల ప్రచారం (Election Campaign) ముగించుకుని దేశ ప్రధాని భారత దేశ చిట్ట చివర ఉన్న కన్నాకుమారిలో ప్రధాని తిష్ట్ వేసి కుర్చున్నారు.
ఏంటి అర్థం కాలేదు కదా.. అయితే ఉండండి అక్కడికే వస్తున్నా… తమిళనాడు (Tahila Nadu) లోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్ ప్రధాని మోదీ కాషాయ వస్త్రాలు ధరించి అతని చేతుల్లో రుద్రాక్ష జపమాలతో దాదాపు 45 గంటల వరకు ప్రధాని ధ్యానంలో ఉండనున్నారు. అంటే జూన్ 1 వరకు ప్రధాని ధ్యానం చేస్తున్నారు.
కాగా ప్రధాని మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు రోజుల ధ్యానానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం తెలిపింది.