Modi’s nomination : వారణాసిలో మే 13న మోదీ నామినేషన్.. కాశీలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి వారణాసి లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి (Varanasi) నుంచి BJP తరఫున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి వారణాసి లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి (Varanasi) నుంచి BJP తరఫున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ BJP వర్గాలు వెల్లడించాయి. ర్యాలీకి ముందు ఆయన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అదే రోజు ప్రధాని భారీ రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు.

కాగా నరేంద్ర మోదీ మొదటిసారి వడోదర – వారణాసి రెండు స్థానాల్లో 2014 లో బీజేపీ (BJP) నుంచి పోటీ చేసి ప్రధాని పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అదే నియోజకవర్గం నుంచి 2019 లో రెండో సారి భారీ విజయం సాధించారు. ఇక ముచ్చటగా మూడో సారి హ్యాట్రిక్ కొట్టి భారత హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించ బోతున్నారు అంటూ బీజేపీ నేతలు సంబంరాలు చేసుకుంటున్నారు.

కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు (General Elections) జరగనున్నాయి. ఇప్పటికే పలు దశల్లో ఎన్నికలు పూర్తి చేసుకుంది. మే 13న దక్షినాదిలో ఎన్నికలు జరగునున్నాయి. ఇక మూడవ దశకు నామినేషన్ల ప్రక్రియ మే 7న ప్రారంభమవుతుంది, జూన్ 1న పోలింగ్ జరగనుంది. మే 14 నామినేషన్ల కు చివరి రోజు కావడం.. మే 11 మరియు 12 వారాంతంలో వస్తుంది. దీంతో బీజేపీ వర్గాలు ప్రధాని నామినేషన్ కు శుభ చూచికగా.. గురువారం వేయనున్నారు. అదే రోజు సోమవారం కావడంతో ప్రధాని మొదటగా కాశీ విశ్వనాథ్ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి (మే 13న) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఇక వారణాసి నుంచి ప్రధాన నరేంద్ర మోదీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు.. ఇండియా కూటమి నుంచి అదే నియోజకవర్గం నుంచి.. మే 10న అక్షయ తృతీయ.. పరశురామ్ జయంతి సందర్భంగా అజయ్ రాయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

SSM