BJP-RESERVATION: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందా..? తేల్చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్..

బీజేపీకి 400 సీట్లు వస్తే పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంటుందని, దీంతో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్ని బీజేపీ అమలు చేయాలనుకుంటోందని కాంగ్రెస్ సహా అనేక పార్టీలు విమర్శిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - April 28, 2024 / 04:31 PM IST

BJP-RESERVATION: దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన అంశం రిజర్వేషన్లు. బీజేపీకి 400 సీట్లు వస్తే పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంటుందని, దీంతో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్ని బీజేపీ అమలు చేయాలనుకుంటోందని కాంగ్రెస్ సహా అనేక పార్టీలు విమర్శిస్తున్నాయి.

MEGASTAR CHIRANJEEVI: దారి తప్పిన అన్నయ్య.. కూటమికి ప్రచారం.. మళ్లీ రాజకీయాల వైపు చిరంజీవి

అందుకే బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాల ఆరోపణ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌‌పై ఆరోపణలు చేశారు. హిందువుల్లో ఉన్న కులాలు, ఉప కులాల వల్ల అందరు హిందువులు ఒక్కటే అని చూపేందుకు ఇబ్బందిగా మారిందని, అందువల్ల రిజర్వేషన్లు రద్దు చేసి, మొత్తం హిందూ సమాజంగా చూపించాలనుకుంటోందని రేవంత్ ఆరోపించారు. రిజర్వేషన్ల రహిత దేశంగా భారత్‌ను ప్రకటించడానికి బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుందని రేవంత్ విమర్శించారు. మరోవైపు.. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

“కొంత మంది వ్యక్తులు ఆర్ఎస్ఎస్‌పై స్వార్థంతో మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ల అంశంపై వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అసత్యం, అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానితో మాకు సంబంధం లేదు. ఎవరి కోసం రిజర్వేషన్లు తెచ్చారో.. వాళ్ల అభివృద్ధి జరిగేవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. రాజకీయ అవసరాల కోసం ఆర్ఎస్ఎస్‌పై అనవసర ఆరోపణలు చేయొద్దు” అని మోహన్ భగవత్ వివరించారు.