Mohan Yadav: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్.. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు

సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆయనతోపాటు జగదీష‌ దేవ్‌డా, రాజేంద్ర శుక్లాను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. మోహన్ యాదవ్‌ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 05:53 PM IST

Mohan Yadav: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్‌ను సీఎంగా నియమిస్తూ సోమవారం సాయంత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆయనతోపాటు జగదీష‌ దేవ్‌డా, రాజేంద్ర శుక్లాను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. మోహన్ యాదవ్‌ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.

YS JAGAN: వైసీపీకి 50మంది ఎమ్మెల్యేలు షాక్ ! ఇప్పుడు ఆళ్ల.. నెక్ట్స్ ఎవరు ?

2013లో ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచినా.. సీఎం ఎంపిక విషయంలో సందిగ్ధత కొనసాగింది. అధిష్టానం ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోలేకపోయింది. చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎంపిక జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. నిజానికి ఈసారి కూడా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కొనసాగిస్తారని భావించారు. కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం సీఎం మార్పునకే మొగ్గుచూపింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్, తెలంగాణ నుంచి ఎంపీ, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు సుదీర్ఘ చర్చలు జరిపి, మోహన్ యాదవ్‌ను ఎంపిక చేశారు.

శివరాజ్‌ సింగ్‌తో పాటు కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ పటేల్‌, నరేంద్ర తోమర్‌ కూడా సీఎం రేసులో ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం మోహన్ యాదవ్‌వైపే మొగ్గు చూపింది. కొత్త సీఎంగా ఎంపికైన మోహన్ యాదవ్‌కు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. శివరాజ్‌ సింగ్‌ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, అందువల్ల మరోసారి ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని మధ్యప్రదేశ్ బీజేపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రులు జ్యోతిరాధిత్యా సింధియా, ప్రహ్లాద్‌ పటేల్‌ మద్దతుదారులు కూడా తమ వారికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.