మంకీ ఫాక్స్… హైదరాబాద్ లో హై అలెర్ట్

మంకీ పాక్స్ అలర్ట్ తో అప్రమత్తమైన వైద్యాధికారులు... హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక మెడికల్ టీం ని ఏర్పాటు చేసారు. ఇంటర్నేషనల్ పాసింజర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్లను డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ జగదీశ్వరరావు పరిశీలించారు.

  • Written By:
  • Publish Date - September 12, 2024 / 11:47 AM IST

మంకీ పాక్స్ అలర్ట్ తో అప్రమత్తమైన వైద్యాధికారులు… హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక మెడికల్ టీం ని ఏర్పాటు చేసారు. ఇంటర్నేషనల్ పాసింజర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్లను డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ జగదీశ్వరరావు పరిశీలించారు. మంకీ పాక్స్ పై ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమయ్యాం అని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు ఆఫీసర్ తో కూడిన వైద్య బృందాన్ని నియమించాం అని పేర్కొన్నారు.

గతంలో ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ సమయంలో పనిచేసిన సిబ్బందిని టీం లో చేర్చి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ పాసింజార్స్ పై దృష్టి పెట్టామని తెలిపారు. స్క్రీ్నింగ్ చేసి.. సస్పెక్ట్ ఉంటే ఆసుపత్రికి తరలించి ఐసో లేట్ చేస్తాం.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తాం అన్నారు. డిల్లి నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీనీ చెక్ చేస్తాం అని తెలిపారు. మంకీ పాక్స్ పై ఎవరు అందోళన చెందొద్దు.. స్వీయ రక్షణ పాటించాలి అని సూచించారు. కేజీహెచ్, చెస్ట్ ఆసుపత్రిలో బెడ్స్ సిద్ధం చేసాం.. ముందు జాగ్రత్తగా అన్నీ విధాలా అప్రమత్తంగా ఉన్నామన్నారు.