DANAM KI YENTI : దానంకు ఎంపీ టిక్కెట్టా ? బొంతుకు దెబ్బపడినట్టేనా !

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం... సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం… సీఎం రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే దానం నాగేందర్ కి ఏం పదవి ఇస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ (Secunderabad) ఎంపీ టిక్కెట్టా… లేదంటే మంత్రి పదవి దక్కుతుందా అనే డిస్కషన్ నడుస్తోంది. అసలు పార్టీ మారిన దానపై వేటు వేయించాలని బీఆర్ఎస్ (BRS) గట్టిగా ప్రయత్నిస్తోంది.

దానం నాగేందర్ కి కాంగ్రెస్ హైకమాండ్ సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇచ్చే ఛాన్సుందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇదే సీటు కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ BRS నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు దానంకు ఆ టిక్కెట్ ఇవ్వడం అన్యాయం అంటున్నారు బొంతు. హైకమాండ్ దే తుది నిర్ణయం అంటోంది తెలంగాణ పీసీసీ. ఒకవేళ పార్టీ హైకమాండ్ ఒప్పుకుంటే… దానంకు మంత్రిపదవి ఇచ్చి… బొంతు ఫ్యామిలీకి సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది. బొంతును గెలిపించే బాధ్యతను దానంకు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఢిల్లీలో ఈ మంగళవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో తెలంగాణలో 13 నియోజకవర్గాల అభ్యర్థులను డిసైడ్ చేస్తారు. ఆ రోజే క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది. ఇందులో సికింద్రాబాద్ కి దానం పేరు ప్రకటిస్తారా… లేదంటే బొంతు ఫ్యామిలీకి ఇస్తారా అన్నది తేలిపోతుంది.

దానం నాగేందర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ తో చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నా… దానం ఒక్కడే ఇప్పటివరకూ అఫీషియల్ గా జాయిన్ అయ్యారు. అందువల్ల ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరుతోంది. ఆదివారం నాడు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఆయన ఇంటికి వెళ్ళారు. సాయంత్రం ఆరింటికి టైమ్ ఇచ్చిన స్పీకర్… తమను కలవలేదన్నారు BRS ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.