మిస్టర్ బచ్చన్ రివ్యూ: “ గేటు తీయండి అంకుల్ ప్లీజ్”

హరీష్ శంకర్ ఒక సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే... ఆ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో క్రియేట్ అవుద్ది. గబ్బర్ సింగ్ సినిమాతో మనాడికి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఒరిజినల్ కథను అలాగే చూపించడం ఈ డైరెక్టర్ కు అసలు నచ్చదు.

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 10:51 AM IST

హరీష్ శంకర్ ఒక సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే… ఆ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో క్రియేట్ అవుద్ది. గబ్బర్ సింగ్ సినిమాతో మనాడికి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఒరిజినల్ కథను అలాగే చూపించడం ఈ డైరెక్టర్ కు అసలు నచ్చదు. అందుకే కొత్త సీన్లు రాసుకుంటూ… మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే విధంగా సినిమా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు రవితేజాతో మిస్టర్ బచ్చన్ ను కూడా అలాగే ప్లాన్ చేసి… మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసాడు. ధమాకా సినిమా తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజాకు మిస్టర్ బచ్చన్ పేరుతో ఒక రీమేక్ కథ వినిపించి సినిమా చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది…? ఈ కథను హరీష్ శంకర్ ఎలా హ్యాండిల్ చేసాడో చూద్దాం.

కథ
హీరో… (మిస్టర్ బచ్చన్) నిజాయితీ గల ఆదాయపు పన్ను శాఖ అధికారి. ఆ శాఖలో కీలక అధికారిగా… రైడ్స్ చేసి… నల్లధనాన్ని బయటకు లాగుతాడు. అలాంటి ఆఫీసర్ ను ఒక రైడ్ తర్వాత సస్పెండ్ చేస్తారు. దీనితో సొంత ఊరు వెళ్ళిపోయి… ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకుని… రన్ చేస్తాడు. ఆ సమయంలో జిక్కీ (హీరోయిన్) ను చూసి… తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అదే సమయంలో… ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి. తన ఇంటికి ఎవరైనా వెళ్ళినా, రైడ్ చేసినా సరే ప్రభుత్వ అధికారులను అత్యంత దారుణంగా చంపేస్తాడు. అలాంటి జగ్గయ్య మీదకు రవితేజాను రైడ్ కు పంపిస్తారు. ఆ తర్వాతి నుంచి సినిమా రూటు మారిపోతుంది. జగ్గయ్యపై ఎలా పోరాటం చేస్తాడు మిస్టర్ బచ్చన్…? జగ్గయ్య ఇంటిపై ఏ విధంగా రైడ్ చేస్తాడు, హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది అనేది కథ.

సాధారణంగా హరీష్ శంకర్ రీమేక్ సినిమా అంటే… కథ మాత్రమే ఒరిజినల్ అంతా ఈయన డిజైన్ చేసుకున్న సీన్లే, తెలుగు వాళ్లకు ఏం కావాలో అదే ఇస్తాడు అనే పేరు ఉంటుంది. కానీ… కానీ… కానీ ఈ సినిమాలో ఆ ప్రయోగం ఫెయిల్ అయింది అని చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు తీసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. కెలికి పెంట పెంట చేసారనే టాక్ వచ్చింది. మీరు పొరపాటున రైయిడ్ సినిమా చూసి ఉంటే ఈ సినిమా అసలు చూడవద్దు అంటున్నారు సినిమా చూసిన జనాలు. అనడం ఏం ఉంది గాని వాస్తవం అదే. ఈ సినిమా సిల్లీగా ఉంటుంది. కామెడి ట్రాక్ మీద ఫోకస్ తో సినిమా మొత్తం కామెడి అయిపొయింది. అన్నపూర్ణ ట్రాక్ అయితే తల బొప్పి కట్టించింది.

సత్యలాంటి టైమింగ్ ఉన్న కమెడియన్ ను పెట్టుకున్నప్పుడు అతనికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. కాని రొట్ట కామెడి అనే టాక్ వచ్చేలా డైరెక్ట్ చేసాడు.

హీరోయిన్ అందాలకు మాత్రం బాగా ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు. ఆమెను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కు నచ్చుతుందో అలా చూపించాడు. ఒక్కో షాట్ లో ఆమెను చూపించిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాని ఆమె డబ్బింగ్ మాత్రం… ఆమెకు డైలాగులు లేకుండా ఉంటే బాగుండేది అన్నట్టుగా ఉంది. ఇక టెక్నికల్ టీం ని బాగా వాడుకుని సీన్స్ పెట్టుకున్నాడు గాని… ఒక్కో సీన్ ను అతికించినట్టు ఉంటాయి తప్ప కనెక్షన్ ఉండదు. ఈ సీన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అన్నట్టు ఉంటుంది.

రవితేజా ఎనర్జీ తో సినిమాను నడిపించినా సినిమాను మాత్రం సరిగా ప్లాన్ చేసుకోలేదు. రవితేజా డైలాగులు కొన్ని ఆకట్టుకున్నాయి. ఇక మిక్కీ జే మేయర్ పాటలు ఒకటో రెండో బాగున్నాయి తప్ప అంచనాలకు తగ్గట్టుగా లేవనే చెప్పాలి. జగపతి బాబు పాత్ర రొటీన్ కాగా చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు తలనొప్పి తెప్పిస్తాయి. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీని కూడా సరిగా ప్లాన్ చేయకుండా ఏదో ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది. లాజిక్ చూపించడంలో హరీష్ శంకర్ సరిగా చేయలేకపోయాడు. అసలు మిస్టర్ బచ్చన్ చేసింది హరీష్ శంకర్ ఏనా అన్నట్టు ఉంది ఈ సినిమా.

ఓవరాల్ గా… కొత్త కథలతో చిన్న దర్శకులు హిట్ కొడుతుంటే… రొటీన్ రొట్ట సినిమాతో సినిమా పూర్తి కాక ముందే టికెట్ కొన్న వాళ్ళను బయటకు పంపాడు.