Mudragada Padmanabham: వైసీపీలోకి కాపు నేత ముద్రగడ.. పవన్‌పై పోటీ చేస్తారా..?

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. తన బృందంతో కలిసి ముద్రగడతో చర్చలు జరిపింది. సీఎం హామీలను ముద్రగడకు మిథున్‌ వివరించారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గెలిస్తే.. ఆయన ఖాళీ చేసే రాజ్యసభ స్థానాన్ని ముద్రగడకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 02:53 PM IST

Mudragada Padmanabham: కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైంది. ఆయన త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు వైసీపీ పెద్దలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ముద్రగడ చేరికకు అమావాస్యే అడ్డుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అమావాస్య తర్వాత ముద్రగడ.. తన కుటుంబసభ్యులతో కలిసి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. తన బృందంతో కలిసి ముద్రగడతో చర్చలు జరిపింది. సీఎం హామీలను ముద్రగడకు మిథున్‌ వివరించారు.

CHIRANJEEVI-PAWAN KALYAN: తమ్ముడి కోసం అన్నయ్య.. పవన్ ఆస్తులను చిరంజీవి కొంటున్నారా?

రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గెలిస్తే.. ఆయన ఖాళీ చేసే రాజ్యసభ స్థానాన్ని ముద్రగడకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురం జనసేన అభ్యర్థి ఎవరో తెలిస్తే.. దానినిబట్టి ముద్రగడను అక్కడినుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపే ఛాన్స్ కూడా ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే.. ఆయనపై ముద్రగడను పోటీగా దించాలని వైసీపీ ప్లాన్‌ చేసింది. కొంతకాలంగా ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మొదట్లో వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. ఇటీవలి కాలంలో ముద్రగడతో జనసేన నేతలు చర్చలు జరిపారు. త్వరలోనే పవన్.. ముద్రగడ ఇంటికి వచ్చి.. జనసేనలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని జనసేన నేతలు కూడా చెప్పారు. కానీ, పవన్.. ముద్రగడ ఇంటికి వెళ్లలేదు. ఆయన్ను కలవలేదు. దీంతో కొద్దిరోజులుగా పవన్, జనసేనపై ముద్రగడ ఆగ్రహంగా ఉన్నారు.

దీంతో ఈ అంశాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగింది. సమయానుకూలంగా వ్యవహరించిన వైసీపీ నేతలు ముద్రగడతో చర్చలు జరిపారు. సీఎం జగన్‌తో ముద్రగడ ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టకేలకు ముద్రగడను తమ దారిలోకి తెచ్చుకుంది వైసీపీ. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమైంది. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాబట్టి.. అదే సామాజికవర్గానికి చెందిన పవన్‌ను దెబ్బకొట్టొచ్చనేది జగన్ ఆలోచన.