అన్ సోల్డ్ అన్నారు… గంటలోనే ముంబై టీమ్ లోకి వచ్చేశాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో...తెరవెనుక తతంగం నడుస్తోందా ? గంటల్లో వేలం పాటలోకి వచ్చే ఆటగాళ్ల జాబితా మారిపోతోందా ? అన్ సోల్డ్ అన్నవారే...అనూహ్యంగా టీంల్లోకి వచ్చేస్తున్నారా ? ఐపీఎల్ వేలంలోనూ రెకమెండేషన్లు నడుస్తున్నాయా ?

  • Written By:
  • Publish Date - November 28, 2024 / 01:16 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో…తెరవెనుక తతంగం నడుస్తోందా ? గంటల్లో వేలం పాటలోకి వచ్చే ఆటగాళ్ల జాబితా మారిపోతోందా ? అన్ సోల్డ్ అన్నవారే…అనూహ్యంగా టీంల్లోకి వచ్చేస్తున్నారా ? ఐపీఎల్ వేలంలోనూ రెకమెండేషన్లు నడుస్తున్నాయా ? ఒకే ఒక్క ఫోన్ కాల్ తో…ఆటగాళ్లు జట్లలో చేరిపోతున్నారా ? అన్ సోల్డ్ ప్రకటించిన అర్జున్ టెండూల్కర్…ముంబై ఫ్రాంఛైజీలోకి ఎలా వచ్చాడు ? కథ నడిపిందెవరు ?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది. సీజన్ సీజన్ కు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. ఆటకు ఆదేస్థాయిలో ఆదరన పెరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కు వేలం జరిగింది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు…భారీ ధరకు అమ్మడయ్యారు. లెఫ్ట్ హ్యండ్ బ్యాటర్ పంత్ అయితే…ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. పంత్​ను సొంతం చేసుకోవాలని భావించిన లక్నో జట్టు…మొదట రూ.20.75 కోట్లతో అత్యధిక బిడ్‌ వేసింది. చివరకు రూ.27 కోట్లు చెల్లించాలి మరీ కొనుగోలు చేసింది. గత సీజన్లలో రాణించిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్లు వేలంలో అమ్ముడవలేదు. ఏ ఫ్రాంచైజీ వారిని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

గ్రాండ్ జరిగిన ఐపీఎల్ వేలంలో…దిగ్గజ బ్యాటర్ సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 30లక్షల బేస్‌ ప్రైజ్‌కు అతన్ని తీసుకుంది. వేలంలో మొదట అర్జున్ కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. అతన్ని ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి అతడ్ని ముంబై టీం కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. గంటలోనే గుర్తు తెలియని వ్యక్తులు చక్రం తిప్పేశారు. వేలం నిర్వాహకులకు ఫోన్ చేశారు. దీంతో అసలు విషయాన్ని బయట పెట్టకుండా…మిగిలిపోయిన మిగిలిపోయిన ఆట‌గాళ్ల‌ని మ‌ళ్లీ వేలం వేశారు. దీంతో ముంబై జ‌ట్టు బేస్ ప్రైజ్‌కి సచిన్ తనయుడ్ని సొంతం చేసుకుంది. ముంబై ఫ్రాంఛైజీనే ఎందుకు కొనుగోలు చేసిందంటే…మాస్టర్ బ్లాస్టర్ ముంబై ఇండియ‌న్స్ చాలా కాలం ఆడాడు. ఆ టీంకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గాను కొనసాగుతున్నాడు. గ‌తంలోనూ అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అర్జున్ ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. చివ‌రికి గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ముంబై ఇండియన్స్ తీసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

గత సీజన్లలోనే అన్నింటా విఫలమైన అర్జున్ టెండూల్కర్…2025లో ఎలా ఆడుతాడన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. ఈ సీజ‌న్‌లో ఒక‌ట్రెండు మ్యాచ్‌లు అర్జున్ ఆడించినా…వాటిలో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందనే దాన్ని బ‌ట్టి అర్జున్ కెరీర్ డిసైడ్ కానుంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటే…కచ్చితంగా ఫైనల్ లెవెన్ లో ఉంటాడు. లేదంటే సీజన్ మొత్తం బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అర్జున్ టెండూల్కర్ అద్భుతాలు సృష్టిస్తాడ‌ని ముంబై ఇండియన్స్ కూడా భావించడం లేదు. ఫైనల్ 11లో ఉండటం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే అక్క‌డ పోటీ ఎక్కువ‌. కేవ‌లం.. అద‌న‌పు ఆట‌గాడుగా మాత్ర‌మే అర్జున్ కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఓ దిగ్గ‌జం వార‌సుడు.. ఇలా బెంచ్ కే పరిమితం కావడం బాధాకరమే. టాలెంట్ మాత్ర‌మే శ్రీ‌రామ ర‌క్ష అని మరోసారి తేలిపోయింది.

అర్జున్‌ టెండ్కూల్కర్ ను బేస్ ధరకు ముంబై కొనుగోలు చేయడంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. దేవుడి తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ వార్షిక పాకెట్‌ మనీ యోజనలో భాగంగా…ముంబై కొనుగోలు చేసిందని కామెంట్‌ చేస్తున్నారు. ఏ కోడింగ్‌ నేర్చుకోకుండానే…అర్జున్‌ ప్రతి సంవత్సరం 30లక్షలు సంపాదిస్తున్నాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ రెఫరెన్స్ తోనే ముంబై ఫ్రాంఛైజీ అర్జున్ కొనుగోలు చేసిందని ఒకరంటుంటే…ఎప్పుడు లేని విధంగా మిగిలిపోయిన ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించడం ఏంటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా టెండూల్కర్ లాబీయింగ్ తోనే నడిచిందని అంటున్నారు.