హైదరాబాద్ లో హైడ్రా మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టింది. కాస్త సైలెంట్ అయినట్టు అనిపించినా ఇప్పుడు మాత్రం దూకుడుగా వెళ్తోంది హైడ్రా. మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో కూల్చివేతలు మొదలుపెట్టింది. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణల కూల్చివేసారు. స్వర్ణపురి లోని వైసీపి నేత కాటసాని రాం భూపాల్ రెడ్డి ఫాం హౌస్ కూల్చేశారు.
ప్రముఖ నటుడు,మాజీ ఎంపి మురళీమొహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలి లోని రంగలాల్ కుంట చెరువులో… జయభేరి సంస్థ ఆక్రమణలను గుర్తించిన హైడ్రా… నోటీసులు జారీ ఇచ్చింది. 15రోజుల్లో నిర్మాణాలను కూల్చివేయాలని, లేకపోతే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీమోహన్… మూడు దశాబ్దాలుగా తాము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, ఎక్కడా ఆక్రమణలకు పాల్పడలేదని… రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ పరిధిలో… రేకుల షెడ్లు తొలగించాలని హైడ్రా నోటీస్ ఇచ్చిందని… పదిరోజుల్లో తామే కూల్చివేస్తామని స్పష్టం చేసారు.