ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు, చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అలాంటిదే జరగబోతుందా అనే అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ గా తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్..వ్యక్తమవుతున్నాయి.
ఐకాన్ స్టార్ (Icon Star) గా తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. తనపై మెగా హీరో అనే ముద్ర లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే బన్నీ.. మెగా బ్రాండ్ కి, మెగా కుటుంబానికి దూరంగా జరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు మెగా అభిమానులు ఎప్పటినుంచో బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఇక ఇటీవల బన్నీ చేసిన ఓ పని.. మెగా అభిమానులందరి ఆగ్రహానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ‘మెగా వర్సెస్ అల్లు’ (Mega vs. Allu) వార్ కి దారితీశాయి. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అండగా నిలబడితే.. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికితోడు బన్నీ తీరుతో ఇప్పటికే కొందరు మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నుంచి బన్నీతో తమకు సంబంధం లేదని, అతని సినిమాలు చూసేది లేదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.అంతేకాదు, ‘పుష్ప-2’ (Pushpa-2) ని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోగా అవతరించిన బన్నీ.. త్వరలో ‘పుష్ప-2’తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలున్నాయి. ‘పుష్ప-2’ ఆశించిన విజయాన్ని అందుకుంటే.. అల్లు అర్జున్ స్టార్డం ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ ‘పుష్ప-2’ని బాయ్ కాట్ చేస్తే మాత్రం.. కలెక్షన్ల పరంగా తెలుగునాట తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల అభిమానగణం భారీగా ఉంటుంది. వారిలో మెజారిటీ అభిమానులు అల్లు అర్జున్ సినిమాలను కూడా చూస్తుంటారు. అయితే ఇప్పుడు వారు ‘పుష్ప-2’ని బాయ్ కాట్ చేస్తే.. ఖచ్చితంగా వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. పైగా ‘పుష్ప పార్ట్-1’.. ఓవరాల్ గా హిట్ అయినప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా తెలుగునాట మాత్రం నష్టాలనే చూసింది. ఇప్పుడు ‘పుష్ప-2’కి ఓ రేంజ్ లో బిసినెస్ జరిగే అవకాశముంది. ఆ స్థాయి బిజినెస్ కి లాభాలు రావాలంటే అల్లు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. అందరు హీరోల అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మెగా అభిమానుల సపోర్ట్ లేకుండా.. తెలుగునాట ‘పుష్ప-2’ లాభాలను చూస్తుందో లేదో చూడాలి.