Rajanikanth: మ్యూజిక్ చేసే మ్యాజిక్ తోనే సినిమా సూపర్ హిట్

సినిమా హిట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ ఎవరికి కట్టబెడతారు. సింగిల్‌ మ్యాన్‌ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్‌ ఇలా ఇవ్వడంతో జైలర్‌ సక్సెస్‌ వివాదాస్పదమైంది.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 10:20 AM IST

రజనీకాంత్‌ చాలా సంవత్సరాల తర్వాత జైలర్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. బీస్ట్‌ ఫ్లాప్‌ తర్వాత దర్శకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ను మార్చాలని నిర్మాత కళానిధి మారన్‌ రజనీకాంత్‌తో చెప్పినా.. వద్దని అతనిపై నమ్మకం వుంచాడు. అయితే రీసెంట్‌గా జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో రజనీకాంత్‌ మాటలను కొందరు తప్పు పడుతున్నారు. సక్సెస్‌ క్రెడిట్‌ డైరెక్టర్‌కు ఇవ్వడకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్ కి కట్టబెట్టడం ఏంటన్న వాదన నడుస్తోంది.

సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో రజినీకాంత్ మాట్లాడుతూ.. రీ రికార్డింగ్ పూర్తి కాక ముందు నెల్సన్ స్నేహితుడు, సన్ పిక్చర్స్ కి చెందిన వ్యక్తితో కలిసి సినిమా చూశాను. నెల్సన్‌ ఫ్రెండ్‌కు సినిమా బాగా నచ్చింది. హిట్‌ అన్నాడు. నెల్సన్ స్నేహితుడివి కనుక అలా అన్నావు. నాకైతే ఎబో యావరేజ్ అన్నాను. రీ రికార్డింగ్‌ తో సినిమా మొత్తం మారిపోయిందన్నాడు. రీ రికార్డింగ్ కారణంగా జైలర్‌ సూపర్‌ హిట్ అన్నట్లుగా రజినీకాంత్‌ చెప్పుకొచ్చాడు. ఎబో యావరేజ్ సినిమా ను రీరికార్డింగ్‌ సూపర్‌ డూపర్ హిట్ గా మార్చిందా? అంటూ తప్పుపడుతున్నారు.

అయితే.. ఫ్యాన్స్‌ మాత్రం రజనీకాంత్‌ మాటలను సమర్ధిస్తున్నారు.అసలు జైలర్‌కు కావాలయ్యా.. హుకుం సాంగ్స్‌ హైప్‌ తీసుకొచ్చాయని.. అనిరుధ్‌ గుర్తిండిపోయే రీరికార్డింగ్‌ ఇచ్చాడన్నారు. మ్యూజిక్‌ హిట్‌ అయితే సగం సినిమా హిట్టయినట్టే లెక్క. ఆడియోతో మెప్పిస్తే.. సినిమాకు హైప్‌ వస్తుంది. భారీ ఓపెనింగ్స్‌ వస్తాయి. మ్యూజిక్‌ కీ రోల్‌ పోషించిన సినిమాల రిజల్ట్ చూస్తే.. సంగీతం ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది.

విజయ్‌దేవరకొండ, సమంత నటించిన ఖుషీకి పాటలు హైప్‌ తీసుకొచ్చాయి. ఏ పాటకి ఆ పాటే అన్నట్టు జనాల్లోకి వెళ్లిపోయి సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ రావడానికి కారణమైంది. సినిమా ఫ్లాప్‌ అయినా.. 3 రోజుల్లో 70 కోట్ల గ్రాస్‌ రావడానికి షేషామ్‌ అబ్దుల్‌ వహాబ్‌ మ్యూజిక్‌ కీ రోల్‌ పోషించింది. ఫస్ట్ సింగిల్‌ నచ్చితే ఆడియన్స్‌ సినిమాను నెత్తినపెట్టుకుంటారు. ఇంకే కావాలే అంటూ సిద్ద్‌ శ్రీరామ్‌ వాయిస్‌ నుంచి వచ్చిన పాటతో గీత గోవిందంపై అంచనాలు పెరిగిపోయాయి. అల వైకుంఠపురంలో నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌ సామజవరగమన సినిమానే కాదు.. బుట్టబొమ్మ.. రాములో రాములా సాంగ్‌ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఈ బ్లాక్‌బస్టర్‌ క్రెడిట్‌ను త్రివిక్రమ్‌ తమన్‌కు ఇచ్చేశాడు.

ఇక రీరికార్డింగ్‌ జరగకుండా.. శ్రీరామదాసును చూసిన నాగార్జున.. సినిమాపై నమ్మకం వదిలేసుకున్నాడు. రీరికార్డింగ్‌ శ్రీరామదాసును నిలబెట్టిందని నాగార్జునే వ్యాఖ్యానించాడు. సినిమా ఏవరేజ్‌గా వుంటే.. మ్యూజిక్‌ హిట్‌ చేసే ఛాన్స్‌ వుంది. మ్యూజిక్‌ సాదా సీదాగా వుంటే.. ఏవరేజ్‌ మూవీస్‌ కూడా ఫ్లాప్‌ అయిన సందర్భాలున్నాయి. అందుకే.. ఆడియో హిట్‌ అయితే సినిమా సగం సక్సెస్‌ అంటారు. విక్రమ్‌ మూవీ హిట్‌కు రీరికార్డింగ్‌ హెల్ప్‌ అయిందని అందరూ మాట్లాడుకున్నదే. సో ఇక నుంచి హీరోలు, డైరెక్టర్స్ కి మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ ని కూడ జనం ఆకాశానికి ఎత్తాలి.