Mutthi Reddy Yadagiri Reddy : కేటీఆర్ పై రగిలిపోతున్న ముత్తిరెడ్డి..!

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి.. జనగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు BRS అధిష్టానం. ఆయన్ని బుజ్జగించడానికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా.. ప్రభుత్వం మారడంతో ఆ పదవీ ఊడిపోయింది. తన టిక్కెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జనగామలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్నారు. ఇవన్నీ తలుచుకుంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కడుపు తరుక్కుపోతోంది. బీఆర్ఎస్ లో కొనసాగడం నింపుల కుంపటిలాగా ఉన్నట్టుంది.

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి.. జనగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు BRS అధిష్టానం. ఆయన్ని బుజ్జగించడానికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా.. ప్రభుత్వం మారడంతో ఆ పదవీ ఊడిపోయింది. తన టిక్కెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జనగామలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్నారు. ఇవన్నీ తలుచుకుంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కడుపు తరుక్కుపోతోంది. బీఆర్ఎస్ లో కొనసాగడం నింపుల కుంపటిలాగా ఉన్నట్టుంది. అందుకేనేమో.. తన కసితీరడానికి.. డయల్ న్యూస్ కి చెందిన ఓ వీడియోని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఇది చూసిన జనం.. ఏంటి ముత్తిరెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడా అని జనగామ నియోజకవర్గంలో పెద్ద చర్చ చేస్తున్నారు.

జనగామ BRS మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాపం అంతులేని బాధ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు గులాబీ బాస్ టిక్కెట్ ఇవ్వలేదు. బుజ్జగించి.. ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ మూడో ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డికి.. ఆ కుర్చీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే.. రెండేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆర్టీసీ ఛైర్మన్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. జనగామ సీటు మళ్ళీ బీఆర్ఎస్ కే దక్కింది. ముత్తిరెడ్డికి టిక్కెట్ నిరాకరించిన అధిష్టానం పల్లా రాజేశ్వర రెడ్డికి ఇచ్చింది. ఆయన గెలిచారు. దాంతో ముత్తిరెడ్డికి ఇంకా తీరని దు:ఖం.. తన ముందే పల్లా ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తున్నారు. తన సీటు తనకు రాకుండా చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వాట్సాప్ స్టేటస్ గా పెట్టిన డయల్ న్యూస్ వీడియో వైరల్ అవుతోంది.

అహంకారం వల్లే కేటీఆర్ అధికారం కోల్పోయారంటూ.. బండి సంజయ్ నాలుగైదు రోజుల క్రితం ఆరోపణలు చేశారు. డయల్ న్యూస్ లో వచ్చిన ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు ముత్తిరెడ్డి. దాంతో జనగామ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ అయింది. ఏంటి.. ముత్తిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారా ? అందుకే బండి సంజయ్ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టారా అన్న టాక్ నడుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీయే తప్ప.. బీఆర్ఎస్ కు సీట్లు వచ్చేది లేదన్న టాక్ నడుస్తోంది. దాంతో తాను కమలం పార్టీలోకి జంప్ అవడం బెటర్ అని ముత్తిరెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే కోపంతో కేసీఆర్ ని తిట్టిపోస్తున్న వీడియో స్టేటస్ గా పెట్టుకున్నారని జనగామ జనం అంటున్నారు.