Janasena: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది జనసేన. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు చేస్తున్న అవినీతి గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని గతంలోనే నాదెండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అనేక స్కాంల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో విద్యా శాఖలో జగనన్న విద్యా కానుక పేరుతో జరిగిన స్కామ్‌ను ఈ రోజు వెల్లడించారు. • ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళాయి.
• ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 5 కంపెనీలపై దాడులు చేసింది. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్‌లో డొంక కదిలింది. • ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా..? నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టింది. • 5 కంపెనీలు సిండికేట్‌గా మారాయి అనేది అర్థం అవుతోంది. నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారు. కమీషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. • ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరున్నారు? పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారు. • ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు. అయితే జగనన్న విద్యా కానుకకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది 42 లక్షలు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుంది..? • ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారు. గోడ మీద చూపించే వాటికీ, విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం లేదు. • విద్యార్థులకు ఎడమ కాలుకి 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకి 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారు. • క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారు. పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారు.