JANASENA: భూ కేటాయింపు పేరుతో వైసీపీ స్కాం.. మరో స్కాం బయటపెట్టిన జనసేన నేత నాదెండ్ల

సీఎంకి అత్యంత సన్నిహితమైన రెండు, మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం.లీజు అని చెప్పారు.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 04:41 PM IST

JANASENA: వైసీపీ అక్రమాలు, అవినీతిపై జనసేన పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వరుసగా వైసీపీ కుంభకోణాల్ని జనసేన బయటకు తీస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో స్కాంలు బయటపెడుతోంది. దీనిపై మరో స్కాం బయటపెట్టేందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (NADENDLA MANOHAR) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖలో భూ కేటాయింపు పేరుతో వైసీపీ భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

REVANTH REDDY: కర్ణాటక ఫార్ములా! కాంగ్రెస్‌ గెలిచినా రేవంత్‌ సీఎం కాలేరా?

“వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది. ఇది కేవలం సీఎంకి అత్యంత సన్నిహితమైన రెండు, మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం.లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్‌కి మారింది. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్‌కి ధారదత్తం చేసి యజమానిని చేశారు. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3,200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్‌గా వ్యవహరించబోతుంది.

మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్‌కి కట్టబెట్టారు. ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి సన్నిహితులదే. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు” అని నాదెండ్ల వివరించారు.