Nadendla Manohar: సలహాదారుల కోసం వందల కోట్ల ఖర్చా..? మంత్రులుండగా సలహాదారులెందుకు: నాదెండ్ల

80-90 సలహాదారులకు ఈ ప్రభుత్వం రూ.680 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తంలో.. సలహాదారుగా ఉన్న సజ్జలకు పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు. వీళ్లేం సలహాలిస్తున్నారు..? ప్రభుత్వం ఏం పాటిస్తుంది..? ఐబీ వంటి సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఏ సలహాదారు చెప్పారు..?

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 06:00 PM IST

Nadendla Manohar: సలహాదారులు ఏం సలహాలిస్తున్నారని, మంత్రులుండగా సలహాదారులెందుకని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సలహాదారుల పేరుతో ప్రజా ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందన్నారు. “ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించింది.

PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్

సలహాదారుల నియామకంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. గతేడాది మార్చిలో సలహాదారులను పబ్లిక్ సర్వెంట్లుగా పేర్కొంటూ కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. సలహాదారులు కూడా సీఎం జగన్‌ను కలవలేకపోతున్నారు. కొద్దిమంది సలహాదారులు ఇక్కడి వ్యవస్థను చూసి రాజీనామా చేసేశారు. సుభాష్ గార్గ్, రామచంద్ర మూర్తి వంటి సలహాదారులు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. 80-90 సలహాదారులకు ఈ ప్రభుత్వం రూ.680 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తంలో.. సలహాదారుగా ఉన్న సజ్జలకు పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు. వీళ్లేం సలహాలిస్తున్నారు..? ప్రభుత్వం ఏం పాటిస్తుంది..? ఐబీ వంటి సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఏ సలహాదారు చెప్పారు..? అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారో సీఎం జగనుకైనా తెలుసా..? సలహాదారుల జాబితాను విడుదల చేయాలి..? ఆ సలహాదారులు ఏం సలహాలు ఇచ్చారు..?

వారిచ్చిన సలహాలను ఏం అమలు చేశారు..? మంత్రులను.. అధికారులను వినియోగించుకోకుండా సలహాదారులతో పనేంటి..? సలహాదారుల ఖర్చు ఏ బడ్జెట్ పద్దు కింద ఖర్చు పెట్టారో చెప్పాలి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సలహాదారులకు ఇంతేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది..? సలహాదారుల ఖర్చుపై ప్రభుత్వంలోకి వచ్చాక విచారణ చేపడతాం. సీబీఎస్ఈ సిలబస్‌నే అమలు చేయలేని ప్రభుత్వం ఐబీ అంటోంది. సీబీఎస్ఈ సంగతేంటంటే వచ్చే ఏడాదిలో పరీక్షలు రాయిస్తామని మంత్రి చెబుతున్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది” అని నాదెండ్ల విమర్శించారు.