పామును చూస్తే ఎవరైనా భయపడతారు. ఇంట్లోనే పాము కనిపిస్తే వణికిపోతారు. అదే పాము… ఇంటి పూజ గదిలో కనిపిస్తే..? దేవుడి పటాల వెనుక చేరి కదలకపోతే…? ఏం చేస్తారు..?.. అసలు దేవుడి పటాల దగ్గరకు పాము ఎలా చేరింది…? పూజగదిలో పాము కనిపిస్తే నాగేంద్రుడు వచ్చినట్టేనా..?
చెట్టు-పుట్టల్లో ఉండాల్సిన నాగుపాము… ఇంట్లో చేరింది. ఎలా వచ్చిందో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఎవరి కంటా పడకుండా…. పూజగదిలోకి ప్రవేశించింది. దేవుడి పటాల దగ్గర బస చేసింది. కలియుగదేవుడు వేంకటేశ్వరస్వామి పటం వెనుక దాగింది. పూజ చేసేందుకు వచ్చిన ఆ ఇంట్లో వారు… శ్రీనివాసుడు పటం దగ్గర పామును చూసి షాకయ్యారు. భయంతో వణికిపోయారు. నాగుపాము.. పడగవిప్పి బుసలు కొట్టింది.
పామును ఇంట్లో నుంచి పంపేసేందుకు చాలా ప్రయత్నించారు. కానీ వీలుకాలేదు… పాము అక్కడి నుంచి అస్సలు కదల్లేదు. నా స్థానం ఇదే అన్నట్టు అక్కడే ఉండిపోయింది. అది గమనించిన… ఆ ఇంట్లో వారు… ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంత ప్రయత్నించినా…. వేంకటేశ్వరుడి పటం దగ్గర నుంచి పాము కదలకపోవడం ఏంటి..? అని ఆలోచనలో పడ్డారు. చుట్టుపక్కలవాళ్లను పిలిచారు.
చుట్టుపక్కల వాళ్లు వచ్చారు… పామును బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కదిలేదేలేదు.. అన్నట్టు స్వామివారి పటం వెనుకే బసలు కొడుతూ ఉండిపోయింది నాగుపాము. దీంతో.. నాగేంద్రుడే దిగి వచ్చాడని స్థానికులు మాట్లాడుకున్నారు. ఆ మాట…. ఆ నోటా ఈ నోటా.. ఊరంతా పాకింది. ఊరి జనమంతా.. వచ్చి పామును దర్శించుకున్నారు.
ధనుర్మాసం విష్ణువుకు ఎంతో ప్రీతికరం. పాలకడలిలో శేషతల్పమున శయనించే శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీవెంకటేశ్వరస్వామి. అందుకే ధనుర్మాసంలో…. ఆ దేవదేవుడిని సేవించుకోవాలని… ఆ శేషుడే… నాగేంద్రుడై దిగివచ్చాడని అక్కడి భక్తులంతా విశ్వసించారు. వేంకటేశ్వరస్వామి పటం వెనుక ఉన్న నాగుపాముకు కూడా పూజలు చేశారు. ఇంతకీ.. ఇదంతా ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. మహబూబాబాద్ జిల్లా గార్లలో జరిగింది. పూజగదిలోకి పాము రావడం…. దేవుడి పటం వెనుక చేరి కదలకపోవడం…. ఇదంతా ఒక అద్భుత దృశ్యమని చూసినవాళ్లంతా అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ మారింది. ఈ వీడియో చూసిన వారికి ఎంతో మేలు జరుగుతుందని… కొందరు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.