NALINI: వీళ్ల సంగతి చూడాలి అన్నా.. సీఎం రేవంత్‌కు నళిని సీక్రెట్‌ రిపోర్ట్‌..

నళిని సడెన్‌గా తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె రేవంత్‌ రెడ్డిని కలవడమే షాకింగ్‌ విషయమంటే.. ఆయనకు ఓ సీక్రెట్‌ నివేదిక ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎంను కలిసిన తరువాత తాను ఇచ్చిన రిపోర్ట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నళిని.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 04:32 PM IST

NALINI: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత మాజీ డీఎస్పీ నళిని మరోసారి తెరమీదకు వచ్చారు. నళిని ఒప్పుకుంటే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. ఒకవేళ ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ఏదైనా సమస్య ఉంటే అదే స్థాయిలో ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కానీ నళిని మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, తన జీవితాన్ని ఇక వేద ప్రచారం కోసం మాత్రమే అంకితం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

TDP Vs YSRCP: రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టిన టీడీపీ.. జగన్‌కు చుక్కలు కనిపించడం ఖాయమా..?

దీంతో అంతా నళిని విషయంలో సైలెంట్‌ అయ్యారు. అలాంటి నళిని సడెన్‌గా తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె రేవంత్‌ రెడ్డిని కలవడమే షాకింగ్‌ విషయమంటే.. ఆయనకు ఓ సీక్రెట్‌ నివేదిక ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎంను కలిసిన తరువాత తాను ఇచ్చిన రిపోర్ట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నళిని. తాను ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోని పరిణామాలు దానికి కారణమైన వ్యక్తుల గురించి రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు చెప్పారు. వాటితో పాటు కొన్ని కీలక అంశాలను కూడా రిపోర్ట్‌లో మెన్షన్‌ చేశానని.. వాటిపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వెయ్యాలని సీఎంను కోరినట్టు చెప్పారు. రేవంత్‌ రెడ్డి కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారని చెప్పారు. రిపోర్ట్‌ను పూర్తిగా స్టడీ చేసిన తరువాత దానిపై నిర్ణయం తీసకుంటానని చెప్పారట రేవంత్‌ రెడ్డి.

ఇక తన జాబ్‌కు సంబంధించిన ప్రస్తావన అక్కడ రాలేదని చప్పారు నళిని. ప్రస్తుతం తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేద ప్రచారం చేస్తున్నానని.. ఆ జీవితమే తనకు సంతోషాన్నిస్తోందని చెప్పారు. బ్యూరోక్రసీ మీద తనకు నమ్మకం పోయిందని.. ఇప్పుడు మళ్లీ ఉద్యోగం చేయాలి అనుకోవడంలేదని చెప్పారు. అయితే నిళిని విషయంలో ముందు నుంచీ పాజిటివ్‌గా ఉన్న రేవంత్‌ ప్రభుత్వం ఆమె రిపోర్ట్‌పై ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటుందో చూడాలి మరి.