Nara Chandrababu Naidu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ దాఖలు.. నివేదికలోని విషయాలివే..!

చంద్రబాబు కుడి కంటికి వైద్యులు కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబధించి కోలుకునేందుకు మందులు వాడాలి. ఐదు వారాలపాటు వైద్యులు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 06:44 PM IST

Nara Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్టును ఏపీ హైకోర్టుకు సమర్పించారు ఆయన తరఫు లాయర్లు. చంద్రబాబు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇటీవలే చంద్రబాబుకు కంటి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. కోర్టుకు వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రబాబు కుడి కంటికి వైద్యులు కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబధించి కోలుకునేందుకు మందులు వాడాలి.

ASSEMBLY ELECTIONS: మా సంగతేంటి..?.. స్కూల్ ఫీజులు.. హాస్పిటల్ బిల్లులపై ప్రశ్నిస్తున్న మిడిల్ క్లాస్..!

ఐదు వారాలపాటు వైద్యులు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. ఐదు వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. అలాగే చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిణామం పెరిగింది. బ్లాక్స్ ఉండటం వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కువగా జరుగుతోంది. గుండె వాల్వులలో ఇబ్బందులు ఉన్నాయి. కాల్షియం శాతం అధికంగా ఉంది. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరం.

డయాబెటిస్ అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలి. స్కిన్ ఎలర్జీకి సంబంధించి కూడా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాబుకు ఎలర్జీ పెరిగిందని కూడా వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో, 24 గంటల పాటు అంబులెన్స్‌లో ట్రెయిన్డ్ డాక్టర్ ఉండాలి అని వైద్యులు సూచించినట్లు లాయర్లు కోర్టుకు తెలిపారు.