NARA LOKESH: టార్గెట్‌ లోకేష్.. మంగళగిరిలో ఎన్ని నామినేషన్లు పడ్డాయంటే..

మంగళగిరిలో లోకేశ్‌ను మళ్ళీ ఓడించాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. మొదట్లో గంజి చిరంజీవిని దించగా.. ప్రస్తుతం మురుగుడు లావణ్యను వైసీపీ నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో లోకేశ్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోంది వైసీపీ.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 04:43 PM IST

NARA LOKESH: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓడినా.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం వదిలి బయటకు రాకుండా ప్రచారం చేస్తున్నారు. ఆయన భార్య నారా బ్రాహ్మణి కూడా అక్కడే క్యాంపెయిన్ చేస్తోంది.

TELANGANA NOMINATIONS: పార్లమెంట్ బరిలో ఎంతమంది..? ఈ నియోజకవర్గంలోనే 114 మంది పోటీ

మంగళగిరిలో లోకేశ్‌ను మళ్ళీ ఓడించాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. మొదట్లో గంజి చిరంజీవిని దించగా.. ప్రస్తుతం మురుగుడు లావణ్యను వైసీపీ నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో లోకేశ్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోంది వైసీపీ. అందుకే మంగళగిరి ఓటర్లలో కన్‌ఫ్యూజన్ సృష్టించేందుకు ఆ పార్టీ పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువగా మంగళగిరిలో ఏకంగా 65 నామినేషన్లు పడ్డాయి. EVM ల్లో ఇంతమంది అభ్యర్థుల పేర్లు ఉంటే.. ఓటర్లు గందరగోళంలో పడతారని అధికార పార్టీయే ఈ ప్లాన్ చేసిందని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఏపీలో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల కన్నా మంగళగిరిలో లోకేశ్ టార్గెట్‌గానే ఎక్కువ నామినేషన్లు పడినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 22, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 19, బాలకృష్ణ బరిలో ఉన్న హిందూపురంలో 19 నామినేషన్లు పడ్డాయి. కానీ మంగళగిరిలో మాత్రం 65 నామినేషన్లు ఫైల్ అయ్యాయంటే లోకేశ్ టార్గెట్‌గా ప్రత్యర్థి పార్టీ ఎన్ని ప్లాన్స్ చేస్తుందో అర్థమవుతుంది.