తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Elections) ల్లో కమలం మరింత వికసించేందుకు బీజేపీ ఇప్పటికే భారీ బహిరంగ సభలతో కేంద్రమంత్రులతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఎలాగైనా ఈ సారి తెలంగాణలో కాషాయం జెండా ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తుంది.ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ఏకంగా ప్రధాని మోదీ నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. నేటి నుంచి అధికారికంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్నికల శంఖారావం పూరించనున్న బీజేపీ పార్టీ. ఇది వరకు చాలా సార్లు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు చేశారు. తర్వాత దేశ హోంమంత్రి కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇక మొన్న దేశ రక్షణా శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల జోష్ పెరగనుంది. గతంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఇవాళ ఎల్బీ స్టేడియం (LB Stadium) లో బీజేపీ బీసీ ఆత్మగౌరవం (BC self-esteem) పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోదీ (Narendra Modi) ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై బీజేపీ క్యాడర్ లో ఉత్కంఠ మొదలైంది. నేడు మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా హాజరుకానున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తుంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడానికి కమలం పార్టీ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం ఎల్బీ స్డేడియం చేరుకుంటారు. బీజేపీ నిర్వహిస్తున్న బీసీ గర్జన సభలో మోడీ 5:25 గంటల నుంచి 6:15 నిమిషాల వరకు చేరుకోనున్నారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. ప్రధాని మోదీ మళ్లీ 11వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం.