భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా , నటాషా స్టాంకోవిక్ ఇటీవలే విడిపోయారు. కానీ కుమారుడు అగస్త్యకు మాత్రం ఇద్దరూ తమ ప్రేమ పంచుతున్నారు. పాండ్యాతో విడాకులు తీసుకున్నాక స్వదేశం సెర్బియా వెళ్లిపోయిన నటాషా మళ్లీ భారత్ వచ్చేసింది. తాను భారత్ లోనే ఉంటానని స్పష్టం చేసింది. హార్థిక్ తో విడిపోయినా చివరకు తాము ఒక ఫ్యామిలీ అని అగస్త్య గుర్తు చేస్తూనే ఉంటాడంటూ వ్యాఖ్యానించింది. అగస్త్య కోసం పేరెంట్స్ గా కలిసే బాధ్యతను పంచుకుంటామంటూ చెప్పింది. సెర్బియా మోడల్ అయిన నటాషాకు, పాండ్యా కరోనా టైమ్ లో ఒక్కటయ్యారు. నాలుగేళ్ళ మ్యారేజ్ లైఫ్ తర్వాత మనస్పర్థలతో ఈ జంట విడిపోయింది. కానీ కొడుకు అగస్త్య కోసం నటాషా ఇక్కడే ఉంటోంది.