Navjot Singh Sidhu: ఐపీఎల్ కామెంటేటర్‌గా సిద్ధూ.. ఒక్క రోజుకు అన్ని లక్షలా..!

రాబోయే సీజన్‌లో సిద్ధూ కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నారని స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. సిద్ధూతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సిద్ధూను సర్దార్ ఆఫ్ కామెంటరీ బాక్స్‌గా పేర్కొంది. ఈ సీజన్‌లో సిద్ధూ కామెంటరీకి భారీ మొత్తంలో చెల్లించబోతుంది స్టార్ నెట్‌వర్క్.

  • Written By:
  • Updated On - March 19, 2024 / 08:21 PM IST

Navjot Singh Sidhu: నవజోత్ సింగ్ సిద్ధూ.. ఈ వెటరన్ క్రికెటర్, పొలిటీషియన్ పేరు తెలియని వాళ్లు చాలా అరుదు. కొన్నేళ్లుగా క్రికెట్‌ ఆటకు దూరంగా ఉంటున్న సిద్ధూ.. ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 ద్వారా కామెంటేటర్‌గా మారబోతున్నాడు. రాబోయే సీజన్‌లో సిద్ధూ కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నారని స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. సిద్ధూతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

PAWAN KALYAN: కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్.. జనసేన నుంచి పోటీ..

సిద్ధూను సర్దార్ ఆఫ్ కామెంటరీ బాక్స్‌గా పేర్కొంది. ఈ సీజన్‌లో సిద్ధూ కామెంటరీకి భారీ మొత్తంలో చెల్లించబోతుంది స్టార్ నెట్‌వర్క్ గ్రూప్. ఒక్క రోజు కామెంటరీకి రూ.25 లక్షల వరకు అందనున్నట్లు సమాచారం. ఇంత పెద్దమొత్తం అంటే ఎక్కువే అని చెప్పాలి. అయితే, మంచి వాక్చాతుర్యం కలిగిన సిద్ధూకు ఆమాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. సిద్ధూ కామెంటరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 2001లో ఇండియా-శ్రీలంక టూర్‌లో కూడా కామెంటరీ చేశాడు. మధ్యలో కొన్నిసార్లు కూడా తన కామెంటరీతో అలరించాడు. పంచ్‌లు వేయడంలో సిద్ధూ ఫేమస్. అందుకే ఏరికోరి సిద్ధూను ఎంపిక చేసింది స్టార్ యాజమాన్యం. స్టార్ నెట్‌వర్క్‌ గ్రూప్‌ ఛానెల్స్‌లోనే టీవీల్లో ఐపీఎల్ ప్రసారమవుతుంది.

1980, 90లలో సిద్ధూ క్రికెటర్‌గా ఒక వెలుగు వెలిగారు. 1983 నుంచి 1999 వరకు ఇండియా తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. పదహారేళ్ల కెరీర్‌లో 187 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు. అందులో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3,202, వన్డేల్లో 4,413 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలున్నాయి. రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. పలు టీవీ షోలలో కూడా వ్యాఖ్యాతగా పాల్గొన్నారు.