NEELAM MADHU: బీఎస్పీ బీఫాం ఇచ్చింది..! పఠాన్ చెరు బరిలో నీలం మధు..

పటాన్ చెరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో MLAగా కంటెస్ట్ చేయాలనుకున్న మధు.. చివరకు BSP బీఫామ్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. గత వారం, పది రోజులుగా పటాన్ చెరు రాజకీయం అంతా నీలం మధు ముదిరాజ్ చుట్టూనే తిరిగాయి.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 02:27 PM IST

NEELAM MADHU: పఠాన్ చెరు రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. కాంగ్రెస్ (congress) అభ్యర్థిగా ప్రకటించి.. చివరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన నీలం మధు ముదిరాజ్ (NEELAM MADHU).. ఇప్పుడు BSPలో చేరారు. అసలు BRSలో ఉన్నఆయన.. అక్కడ టిక్కెట్ ఆశించి భంగపడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ లిస్ట్‌లో మధు పేరు రావడంతో పటాన్ చెరువు కాంగ్రెస్‌లో లొల్లి మొదలైంది. అక్కడి నుంచి టిక్కెట్ కోసం ముందు నుంచీ ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ఆయన అనుచరులు చుట్టుముట్టారు. మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ అండ కూడా కాటా శ్రీనివాస్‌కే ఉన్నాయి.

Telangana Elections 2023: నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. సురేష్ షెట్కార్ స్థానంలో సంజీవ రెడ్డి

నీలం మధుకి టిక్కెట్ ఇవ్వడాన్ని జగ్గారెడ్డి కూడా వ్యతిరేకించారు. దాంతో కాంగ్రెస్ లిస్టులో పేరున్నా.. గాంధీభవన్‌లో మాత్రం మధుకు బీఫామ్ ఇవ్వలేదు. ఈమధ్యలో బీజేపీ లీడర్లు కూడా నీలం మధును కలుసుకున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ పటాన్ చెరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో MLAగా కంటెస్ట్ చేయాలనుకున్న మధు.. చివరకు BSP బీఫామ్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. గత వారం, పది రోజులుగా పటాన్ చెరు రాజకీయం అంతా నీలం మధు ముదిరాజ్ చుట్టూనే తిరిగాయి. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధు.. పటాన్ చెరువు టిక్కెట్ ఆశించాడు. అందుకు BRS ఒప్పుకోలేదు. దాంతో ఇండిపెండెంట్‌గా అయినా సరే.. ఈ ఎన్నికల్లో నిలబడాలని మధు డిసైడ్ అయ్యారు. ఆ టైమ్‌లోనే కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడం.. బీఫామ్ ఇవ్వకపోవడం లాంటి పరిస్థితులు తలెత్తాయి. నీలం మధు వైపు కాంగ్రెస్ మొగ్గు చూపడానికి అసలు కారణం.. ఆయన సామాజిక వర్గం నుంచి సపోర్ట్, గ్రౌండ్ లెవల్లో ఆయనకు ఉన్న బలం, సర్వేలు అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు.

గతంలో మధు సర్పంచ్‌గా పనిచేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా NMR యువసేన పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ యువసేనలో 50 వేల మంది కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారు. ముదిరాజ్ నియోజకవర్గానికి ఈసారి BRS టిక్కెట్లు కేటాయించకపోవడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన వారి మద్దతు నీలం మధుకు ఉన్నట్టు తెలుస్తోంది. సో.. BRS to కాంగ్రెస్.. అక్కడి నుంచి BSPకి.. ఎట్టకేలకు పటాన్ చెరు నుంచి MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నీలం మధు.