Chandrababu arrested : ఉచ్చు బిగుస్తోందా..! చంద్రబాబుపై కొత్త కేసు.. మరో స్కాం చేశారంటూ నోటీసులు..?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. ఆయన అరెస్ట్‌ తో ఒక్కసారిగా వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యింది. బాబు అరెస్ట్ అయ్యి దాదాపు 50 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ బెయిల్‌ విషయంలో ఎలాంటి డెవలప్‌మెంట్‌ లేదు. మధ్యంతర బెయిల్‌ విషయంలో ఇవాళ కోర్ట్‌ నుంచి కీలక తీర్పు రాబోతోంది. ఇలాంటి టైంలో చంద్రబాబుకు మరో కేసులో నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్య వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఆదేశాలు జారీ చేశారంటూ తాజా అభియోగంలో పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా శ్రీనివాస శ్రీనరేష్‌ను, ఏ2 నిందితుడిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను చేరుస్తూ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇప్పటికే జైల్‌లో ఉండటంతో ఈ కేసుకు సంబంధిచిన నోటీసులను విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించారు. లిక్కర్‌ కంపెనీలకు, లిక్కర్‌ డిస్ట్రిబ్యూటర్లకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని అరోపిస్తూ ఏపీ బీవరేజేస్‌ కార్పోరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేయగా 28న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబును బయటికి రాకుండా చేసేందుకే జగన్‌ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం గురించి మాట్లాడే హక్కు కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. మద్యం నిషేదం పేరు చెప్పి.. జగన్‌ ఆయన అనుచరులు ప్రతీ ఏటా 25 వేలు కోట్లు మద్యం పేరుపై దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కల్తీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ప్రణాలతో చలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. చేసే తప్పులన్నీ చేసి ఇప్పుడు టీడీపీ మీద చంద్రబాబు మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన సప్లమెంటరీ పిటిషన్‌ మీద ఇవాళ తీర్పు రానుంది. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ఇవాళ తీర్పు ప్రకటిస్తామంటూ జడ్జ్‌ చెప్పారు. సప్లమెంటరీ బెయిల్ విషయంలో వచ్చే తీర్పును బట్టి మెయిన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉండబోతోంది. ఇలాంటి టైంలో మరో కేసుతో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.