TSRTC : టీఎస్ఆర్టీసీ కొత్త మార్పులు.. మెట్రోలేని మార్గాల్లో 10 నిమిషాలకో బస్సు…

హైదరాబాద్లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

హైదరాబాద్లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో రైళ్ల తరహాలోనే బస్సులు కూడా సమయపాలనతో నడిచేలా చూడాలని సంస్థ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి బస్సులు నడపాలని TSRTC నిర్ణయించింది.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్- మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47L పేరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222L (లింగంపల్లి – కోఠి) బస్సులకు సైతం సమయాలను నిర్దేశించారు. ఈ రూట్లలో ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకో బస్సు నడపాలని నిర్ణయించినట్టు గ్రేటర్ జోన్ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యతో మెట్రోకు దీటుగా బస్సుల్లో రద్దీ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.