దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. కరోనా కొన్నాళ్లుగా.. తగ్గుముఖం పట్టే పడుతున్న తాజాగా కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. దేశంలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతోన్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయట పడింది. దీన్ని పిరోలా/BA.2.86 అని కూడా పిలుస్తున్నారు. ఓ 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. RT-PCR టెస్టులో ఈ నెల 8వ తేదీనే వైరస్ను గుర్తించగా, ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది, మనిషి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు