CM Revanth Reddy : రేపే తెలంగాణలో కొత్త ప్రభుత్వం.. ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్. రేపు తెలంగాణలో ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతుంది. పార్టీలో అంతర్గత సమస్యలను దాటుకుని సీఎం అభ్యర్థిని ఎంచుకోండి. రేపు గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మూడవ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్. రేపు తెలంగాణలో ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతుంది. పార్టీలో అంతర్గత సమస్యలను దాటుకుని సీఎం అభ్యర్థిని ఎంచుకోండి. రేపు గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మూడవ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

రేపే తెలంగాణలో కొత్త ప్రభుత్వం..

తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. హైదరాబాద్ వేదికగా సీఎల్పీ సమావేశం ఏకవాక్యంతో ముగిసినా సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియకు రెండ్రోజుల సమయం పట్టింది. పార్టీలోని సీనియర్ల అభ్యంతరాల నేపథ్యంలోనే కీలక నేతలు హస్తం నుంచి చేజారిపోకుండా.. పార్టీ సీనియర్లకు సముచీత స్థానం ఇచ్చినట్లు సమాచారం. ఇక అందరిని బుజ్జగించి రేవంత్ రెడ్డి ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు ఏఐసీసీ అగ్రనేతలు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు రేపు ముహుర్తం ఖరారు అయింది.

సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..

ఇక, ప్రమాణ స్వీకారం గురించి రేవంత్.. తెలంగాణ నూతన డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారాంతో సహ మంత్రి వర్గం కూడా ప్రమాణా స్వీకారాలు చేయనున్నట్లు.. సమాచారం. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం దేశ నలుమూలల నుంచి వీఐపీల వస్తారని.. ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీజీపీతో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీ​ఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

డిసెంబర్ 7వ (రేపు) తేదీ ఉదయం 10 గంటల 28 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు 18 మంది వరకూ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం.. అందుకు గానూ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లును జీఐడీతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఇతర సీనయర్లు పర్యవేక్షించారు.

రేపటి వరకు తెలంగాణకు కేసీఆరే సీఎం..

తెలంగాణ అపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత.. సీఎం పదవికి కేసీఆర్ రాజీనామ చేయడం.. ఆ లేఖను దూత ద్వారా రాజ్ భవన్ వెళ్లడం.. అనంతరం రాజీనామా తర్వాత సీఎంకు అధికారికంగా వీడుకోలు పలికేందుకు ఉన్న కూడా కేసీఆర్ ఎలాంటి కాన్వాయ్ లేకుండా కేవలం రెండు వాహనాల్లో తన సొంత నివాసం ఎర్రవేల్లి ఫామ్ హౌస్ కి వెళ్లడం చలచల జరగిపోయాయి. రేపు కొత్త సీఎం, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఈ రాష్ట్రానికి కేసీఆరే సీఎం గా ఉంటారు.

S.SURESH