NEW Rules: కొత్త సంవత్సరం.. కొత్త రూల్స్.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

సిమ్ కార్డుల జారీ విషయంలో కేంద్రం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఇకపై సిమ్ కార్డు కావాలంటే పేపర్‌లెస్ కేవైసీని ఫాలో అవ్వాలి. ప్రస్తుతం సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ జిరాక్స్ అందించి, సైన్ చేయాలి. కానీ, ఇకపై జిరాక్స్‌లు అవసరం లేదు.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 04:15 PM IST

NEW Rules: కొత్త సంవత్సరం అంటేనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం. ఎవరికి వాళ్లు తమను తాము మార్చుకోవడమే కాదు.. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోనూ కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. ఇక.. 2024 జనవరి1 నుంచి కూడా కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వాటిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. పౌరులకు నిత్యం అవసరమయ్యే వాటికి సంబంధించి కొత్తగా అమల్లోకి వస్తున్న రూల్స్ ఇవి.

YS JAGAN: షర్మిల ఎఫెక్ట్.. అభ్యర్థుల మార్పుపై జగన్ పునరాలోచన..
సిమ్ కార్డుల జారీ విషయంలో కేంద్రం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఇకపై సిమ్ కార్డు కావాలంటే పేపర్‌లెస్ కేవైసీని ఫాలో అవ్వాలి. ప్రస్తుతం సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ జిరాక్స్ అందించి, సైన్ చేయాలి. కానీ, ఇకపై జిరాక్స్‌లు అవసరం లేదు. అలాగే బ్యాంకుల్లో కేవైసీ సమర్పించేందుకు ఇకపై బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ లేదా ఈ-మెయిల్‌ ద్వారానే అవసరమైన వివరాలను పంపొచ్చు. యూపీఐ సేవలకు సంబంధించి కూడా కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి. ఎన్సీపీఐ ఆదేశాల ప్రకారం.. ఏడాది కాలంగా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చేయనున్నాయి. నిర్దేశిత కాలంలో కనీసం ఒక్క లావాదేవీ కూడా చేయని యూపీఐ ఐడీలను డిజిటల్ చెల్లింపులకు అందుబాటులో ఉండవు.

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి.. ఆలస్యపు రిటర్న్ లేదా సవరించిన పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ అని గుర్తుంచుకోవాలి. అయితే గడువులోపు రిటర్న్ దాఖలులో విఫలమైతే రూ.5,000 జరిమానా విధిస్తారు. కానీ సవరించిన నిబంధనల ప్రకారం.. రిటర్న్ ఫైలింగ్ ఉచితమే. సకాలంలో దాఖలు చేసిన పన్ను రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు అవకాశం ఉంటుంది. బ్యాంక్ లాకర్ల నిబంధనలు కూడా మారబోతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకుల్లో లాకర్లను కలిగి ఉన్న కస్టమర్లు రివైజ్డ్ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే మరుసటి రోజు వారి లాకర్లు నిలిపివేయబడతాయి. డిసెంబర్ 31లోగా ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఖాతాదారులకు బ్యాంకులు ఇప్పటికే సూచించాయి.