March 1st new rules: ప్రతి నెల పాలన పరంగా, ప్రభుత్వ నిబంధనల పరంగా దేశవ్యాప్తంగా అనేక కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. రాబోయే మార్చి 1 నుంచి కూడా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. వాటిగురించి అవగాహన కలిగి ఉండటం బెటర్. కొత్తగా అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ కార్డులకు సంబంధించి మార్చి నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది.
VIRAL VIDEO: ఆపరేషన్ థియేటర్‌లో నర్స్‌ల ఇన్‌స్టా రీల్స్.. పేషెంట్‌కి ఏమయ్యిందంటే..
క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్‌స్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయి. దీనిపై ఈమేరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తోంది ఎస్బీఐ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్రం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. గత జనవరి 31న ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. పేటీఎం.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దు. మార్చి 15వ తేదీ తర్వాతే ఈ రూల్ అమల్లోకి వస్తుంది. మొదట ఈ ఆంక్షల అమలుకు ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ పొడిగించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన సమీక్షిస్తాయి. కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలోనూ మారుస్తారు. దీని ప్రకారం మార్చి 1 నుంచి చమురు ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
అయితే, గత ఫిబ్రవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచగా.. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ క్రమంలో ఈ సారి గృహ సిలిండర్ ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది. మార్చి 1 నుంచి జీఎస్‌టీకి సంబంధించిన కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఇ-ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర వ్యాపారులు ఇ-వే బిల్లులు ఇవ్వాలి. జీఎస్‌టీ రూల్స్ ప్రకారం రూ.50 వేల పైన వస్తువుల విక్రయాలు జరిపినప్పుడు ఇ-బిల్స్ ఇవ్వాలి. మార్చి 1 నుంచి ఇ-ఇన్వాయిస్ లేకుండా ఇక ఇ-బిల్స్ ఇవ్వడం కుదరదు.