NEW YEAR: హైదరాబాద్‌లో ఈ రూట్లో రాకపోకలు బంద్.. మందుబాబులకు పోలీసుల సలహా..

ఆదివారం రాత్రి సైబరాబాద్ పరిధిలో అన్నీ ఫ్లైఓవర్ లు, ఓఅర్అర్‌పై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ఫ్లైఓవర్లపై అనుమతి లేదన్నారు.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 03:13 PM IST

NEW YEAR: మరికొన్ని గంటల్లో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకొనేందుకు ఔత్సాహికులు సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్ మహానగరంలో వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుకల కోసం నగరం ముస్తాబైంది. మందు, విందుతో పార్టీ చేసేందుకు హైదరాబాదీలు సిద్ధమవుతున్న వేళ పోలీసులు కీలక సూచనలు చేశారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.

CONG FUNDS: కాంగ్రెస్ ఖజానా ఖాళీ…కాంగ్రెస్ దగ్గర డబ్బుల్లేవా ? క్రౌడ్ ఫండింగ్ తో నిధుల వేట

ఆదివారం రాత్రి సైబరాబాద్ పరిధిలో అన్నీ ఫ్లైఓవర్ లు, ఓఅర్అర్‌పై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ఫ్లైఓవర్లపై అనుమతి లేదన్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్ వంటి ఫ్లై ఓవర్లు కూడా మూసివేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ప్రయాణించే వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు నడిపిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అవినాష్ మహంతి హెచ్చరించారు. మద్యం తాగే వ్యక్తులు డ్రింక్‌ చేయని స్నేహితులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. తాగని వారు.. మాత్రమే రిటర్న్‌ వెళ్లేటప్పుడు డ్రైవింగ్‌ చేయాలన్నారు. రెస్టారెంట్లు, పబ్బుల వాళ్లు కూడా ఇది పాటించాలన్నారు.

అలాగే.. క్యాబ్ కోసం బుక్ చేసుకున్న రైడ్‌‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల క్యాబ్ డ్రైవర్లు ఒకవేళ ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. క్యాబ్‌ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్‌ నిరాకరించకూడదని.. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్‌ 178 ప్రకారం ఉల్లంఘన అవుతుందని చెప్పారు. ఎవరైనా రైడ్ క్యాన్సిల్ చేస్తే.. 8712662111 నెంబరుకు వాట్సాప్‌ లో ఫిర్యాదు చేయాలని, రైడ్ క్యాన్సిల్ చేసి ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామన్నారు.