ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల జనాలకు వరుణుడు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాడు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో.. జనాలు రిలీఫ్ అవుతున్నారు. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. ఆ సమయంలో జనాలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది.
దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. మరో మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో తీర ప్రాంత జిల్లాలతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో 5 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
హైదరాబాద్, రంగారెడ్డితో పాటు తెలంగాణలో మెజారిటీ జిల్లాల్లో వానలు కురిసే చాన్స్ ఉంది. ఇక అటు ఈనెల 19న అండమాన్ పరిసరాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయ్. ఈ నెల 31న కేరళను తాకి.. జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయ్. ఐతే మరో మూడు నాలుగు రోజుల తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయ్.