Nifa virus : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం… 15 ఏళ్ల బాలుడికి సోకి వైరస్

కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. మలప్పురం జిల్లాకు చెందిన 15ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు.

 

కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. మలప్పురం జిల్లాకు చెందిన 15ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. వైరస్ సోకిన ఆ బాలుడికి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఆ బాలుడి ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ వైరస్‌ సోకితే మరణించే అవకాశాలు 40-75% ఉండటం, దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది వ్యాప్తి చెందకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో కనిపించని నిఫా వైరస్ మళ్లీ కనిపించడంతో అధికారులు అలెర్ట్ చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. నిఫా వైరస్ మరోసారి కలకలం రేపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గత సంవత్సరంలో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. ఈ నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ సంవత్సంలో ఆ జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. కాగా ఆప్పుడు సోకిన నిఫా వైరస్ బంగ్లాదేశ్‌ వేరియంట్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

  • నిపా వైరస్ అంటే ఏమిటి..?  నిఫా వైరస్ తొలి కేసు ఎప్పుడు..?

నిపా వైరస్ అనేది గబ్బిలాల ద్వారా సంక్రమించే, జూనోటిక్ వైరస్.. ఇది మానవులలో.. ఇతర జంతువులలో వ్యాప్తి చేందే వైరస్.. మొట్టమొదటగా.. ఈ వైరస్ తొలి కేసు.. మలేషియాలోని పందుల పెంపకంలో నరాల, శ్వాసకోశ లో గుర్తించబడింది. ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెంది దాదాపు 265 కేసులకు నమోదయ్యాయి. ఈ వైరస్ దాటికి తొలి నాళ్లలోనే.. సుమారుగా 108 మృత్యువాత చెందారు. 1998లో మొదటి నిపా వైరస్ సంక్రమణ కేసులు గుర్తించబడ్డాయి. ఈ వైరస్ వ్యాప్తి ఒక మిలియన్ పందులను చంపడానికి దారితీసింది.

  • నిఫా వైరస్ ఎలా సోకుతుంది..?

నిపా వైరస్ శ్వాస ద్వారా గానీ, చర్మం ద్వారా గానీ, ఎంగిలి ద్వారా గానీ నోటి తుంపర్ల ద్వారా గానీ ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుంది. ఒక్క సారి నిఫా వైరస్ మానవ శరిరంలోకి ప్రవేశించాకా.. ముందుగా శ్వాసకోశ సమస్య తలెత్తుతుంది. ఆ తర్వాత తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు మంట, గొంతు వాపు, నిద్రమత్తు, తీవ్రమైన శ్వాసకోశ, మూర్ఛ వంటి లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా ఇది పందులు, గబ్బీలాల నుంచి మానవునికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం, నిపా వైరస్ వ్యాక్సిన్ లేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) WHO రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బ్లూప్రింట్‌లో నిపా వైరస్‌ను ప్రాధాన్యత వ్యాధిగా పేర్కొంది.

Suresh SSM