Nita Ambani: ముఖేష్ అంబానీ.. అపరకుబేరుడు. ఆ ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా వారి స్థాయికి తగినట్లుగానే దర్పంగా, గ్రాండ్‌గా ఉంటుంది. ఎంగేజ్మెంట్లు, వివాహాలు జరిగితే ఆ రిచ్‌నెస్‌ను వర్ణించడానికి మాటలు కూడా చాలవు. ఆ సెలబ్రేషన్సే కాదు.. అంబానీ భార్య నీతా అంబానీ కట్టుకునే చీరలు, ధరించే నగలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు వీరి ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహ వేడుకల్లోనూ నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె ధరించిన చీరలు, నగలు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారాయి. నీతా అంబానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.
PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..
ముఖేశ్ అంబానీ భార్యగానే కాకుండా రిలయన్స్ సహ సారథిగా, సక్సెస్ల్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుందీమె. నీతా వద్ద ఖరీదైన పర్సులు, లగ్జరీ కార్లు, కాస్ట్లీ గడియారాలు ఇలా ఎన్నో ఉన్నాయి. మరి.. మామూలు రోజుల్లోనే ఇంత లగ్జరీ లైఫ్‌ను మెంటైన్ చేసే నీతా అంబానీ.. తన ముద్దుల కుమారుడి ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఇంకెంత హైప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తారో కదా. అందుకే మరి తన స్టేటస్‌కు తగ్గట్టుగా నీతా అంబానీ భారీ రిచెన్స్ ఉట్టిపడేలా జ్యువెలరీని, శారీస్‌ను ధరించారు. ఇవి వేడుకలకు హాజరైన అతిథులందరి చేత జస్ట్ లైక్ ఎ వావ్ అనిపించాయి. నీతా ధరించిన ఈ ఆభరణాలు, దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మార్చి 3, 2024న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జరిగే చివరి ఈవెంట్ కోసం, నీతా అంబానీ చేనేత కాంచీపురం చీరలో స్పెషల్ లుక్‌లో మెరిశారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీన్ని రూపొందించారు.
Anil Ambani: అయ్యో అనిల్.. బ్యాగులు మోస్తూ.. దూరందూరంగా.. అన్నకొడుకు పెళ్లిలో అనామకుడిలా అనిల్..
చీరలో స్కాలోప్డ్ బోర్డర్లపై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్ ప్రత్కేక ఆకర్షణగా నిలిచింది. ఇక.. స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్.. ఆ చీరకు అదనపు అందాన్ని తెచ్చిపెట్టింది. సన్నని ఐలైనర్ స్ట్రోక్‌లు, న్యూడ్ లిప్‌స్టిక్, ఎరుపు రంగు బిందీ, లూజ్‌గా వదిలేసిన హెయిర్‌తో నీతా తన సిగ్నేచర్ లుక్‌ని మెంటైన్ చేశారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా లుక్సే అదుర్స్ అనేంతగా ఆమె తన ఫ్యాషన్ అండ్ స్టైల్‌తో మెస్మరైజ్ చేశారు. ఇక.. తన కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన నగలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అనంత్ అంబానీ ‘హస్తక్షర్’ ఈవెంట్లో నీతా అంబానీ చాలా ఖరీదైన నగలు ధరించి.. తమ స్టేటస్ ఏంటో మరో సారి ప్రపంచానికి చాటి చెప్పారు. అందులో ముఖ్యంగా నీతా అంబానీ దరించిన ఓ స్పెషల్ నెక్లెస్ విలువ దాదాపు నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉంటుందట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబానీల లైఫ్ స్టైల్ ఇంత రిచ్‌గా ఉంటుందా అని కొందరు అంటుంటే.. నీతా అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది మరి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ప్రపంచమంతా చెప్పుకునేంత గొప్పగా జరుగుతున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.