Nitish Kumar: ఇండియా కూటమికి మరో షాక్.. బీజేపీకి దగ్గరవ్వనున్న నితీష్..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇండియా కూటమి.. ఎన్నికల నాటికి బలహీనంగా మారి, విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 05:29 PM IST

Nitish Kumar: లోక‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కూటమితో కలిసి కాకుండా.. ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు టీఎంసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీ కూడా ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనుంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు బిహార్ సీఎం నితీష్ కుమార్ సిద్ధమయ్యారు.

YS SHARMILA: వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. జగన్ ఒక నియంత: వైఎస్ షర్మిల

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇండియా కూటమి.. ఎన్నికల నాటికి బలహీనంగా మారి, విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ద్వారా దేశమంతా పర్యటిస్తున్నారు. ఈ నెల 30న ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే, ఇండియా కూటమిలోనే ఉన్నప్పటికీ.. ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తి చూపించడం లేదు. ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు నితీష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. దీనిపై నితీష్ అసంతృప్తితో ఉన్నారు. అందుకే యాత్రకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నితీష్.. బీజేపీ కూటమిలోనే ఉండేవారు.

అనంతరం ఆ పార్టీ నుంచి బయటికొచ్చి, కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన ఇలా కూటములు మారడం ఇదేం కొత్త కాదు. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఎన్డీయే, కాంగ్రెస్‌ కూటముల్ని వరుసగా మారుతూ వస్తున్నారు. NDA, మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD, కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్‌బంధన్‌ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కూటమిని వీడి NDAలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుత పరిణామాల వల్ల ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే అని విశ్లేషకుల అంచనా.