ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇంక మన దేశంలో అయితే.. అంబానీలకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్.. అందుకే ఎవరైనా ఏదైనా కాస్త రిచ్‌గా చేస్తే ఏంటీ అంబానీ అనుకుంటున్నావా అంటూ సెటైర్లు వేస్తాం.. అంటే.. అంబానీ కుటుంబం ఏం చేసినా అదొక సంచలనమే అన్నమటా.. ఇక అంబానీ ఫ్యామిలీలో వేడుకలు, పెళ్లిల్లు ఏ రేంజ్లో జరుగుతాయో అందరికీ తెలిసిందే.. అంగరంగ వైభవంగా అన్నమాటకు అచ్చమైన నిర్వచనంలా జరిగే ఆ ఫంక్షన్స్ చూడాలంటే రెండు కళ్లూ సరిపోవన్నది జగమెరిగిన సత్యం.. ఇక.. రీసెంట్గా ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల ముద్దుల చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఏ రేంజ్లో జరిగాయో అందరికీ తెలిసిందే కదా…
మూడు రోజుల పాటు జరిగిన ఈ సెలబ్రేషన్స్ వరల్డ్ వైడ్‌గా హెడ్ లైన్స్‌లో నిలిచాయి. వరల్డ్ వైడ్‌గా వీవీఐపీలు ఎందరో గెస్ట్లుగా వచ్చిన ఈ వేడుకల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక ఈ వేడుకల్లో ప్రతి చిన్న అంశం కూడా పెద్ద సెన్సేషన్‌గా మారి ఇది కదా అంబానీ రేంజ్ అంటే అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయేలా.. రిచెనెస్సే నివ్వెరపోయేలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది అంబానీ ఫ్యామిలీ.. ఇప్పటికీ ఆ వేడుకల నుంచి తేరుకోలేకపోతున్న జనాలకు మరో క్రేజీ వైరల్ న్యూస్ షాకిస్తోంది. కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు అంబానీ ఫ్యామిలీ ఇవ్వబోతున్న ఓ గిఫ్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అనంత్ రాధికా వివాహం సందర్భంగా ముకేశ్ అంబానీ ఫ్యామిలీ తమ ముద్దుల కోడలికి తమ రేంజ్‌కు తగ్గట్లుగా ఓ భారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందట.. కేముంది? అంబానీ తలచుకుంటే అందెత చెప్పండి. అందుకే.. రాధికాకు అంబానీ ఫ్యామిలీ దుబాయ్‌లో రూ.640 కోట్లు విలువ చేసే ఓ ఖరీదైన విల్లాను కానుకగా ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అంబానీ ఈ విల్లాను 2022 లోనే కొనుగోలు చేశారట.. ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, 10 బెడ్ రూమ్‌లు, ఖరీదైన ఇంటీరియర్‌తో చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట.. అంతే కాదు.. ఇటాలియన్ పాలరాతి దీని స్పెషల్ అట్రాక్షన్ అని అంటున్నారు. ఈ వార్త విని వామ్మో కాబోయే కోడలికి ఈ రేంజ్లో ఖరీదైన గిఫ్టా అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం.. ఆ అవును మరి.. అంబానీ అంటే.. ఆ మాత్రం రేంజ్ ఉంటుంది మరి.. అని కామెంట్లు పెడుతున్నారు.