MODI WAVE : ఈసారి మోడీ వేవ్ లేదు ! నవనీత్ కౌర్ అంతమాట అన్నదా ?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో NDA హ్యాట్రిక్ కొడుతుందనీ.... ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈసారి బీజేపీ సహా NDA కూటమి పార్టీలన్నీ కూడా మోడీ మేనియోతోనే జనంలోకి వెళ్ళాయి. కానీ ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదట. అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా కార్యకర్తలకు చెప్పినట్టు ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో NDA హ్యాట్రిక్ కొడుతుందనీ…. ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈసారి బీజేపీ సహా NDA కూటమి పార్టీలన్నీ కూడా మోడీ మేనియోతోనే జనంలోకి వెళ్ళాయి. కానీ ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదట. అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా కార్యకర్తలకు చెప్పినట్టు ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది. నవనీత్ కామెంట్స్ పై సొంత పార్టీలో గరం అవుతుంటే… మహారాష్ట్రలో NCP, ఇతర ప్రతిపక్షాలు పండగ చేసుకుంటున్నాయి.

మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపు నవనీత్ కౌర్ రాణా పోటీ చేస్తున్నారు. ఆమె గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఇండిపెండెంట్ గా ఎంపీ సీటు గెలుచుకున్నారు. ఈమధ్యే బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆమెకు అమరావతి టిక్కెట్ ఇచ్చింది కమలం పార్టీ. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగడంతో నవనీత్ కౌర్ కి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది.

ఈ ఎన్నికలను గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లాగే పోరాడాలని నవీనత్ కౌర్ అంటోంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్లు అందర్నీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటు వేయించాల్సిన పరిస్థితి ఉంది. మోడీ వేవ్ ఉందన్నే భ్రమల్లో ఉండొద్దని పార్టీనేతలు, కార్యకర్తలకు నవనీత్ క్లాస్ పీకారు. గతంలో మోడీ వేవ్ ఉన్నా… తాను ఇదే అమరావతి నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన సంగతి గుర్తు చేసింది. ఇప్పుడు ఇంకెంత కష్టపడాలో అంటోంది నవనీత్ కౌర్.

నవనీత్ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కార్యకర్తలను కష్టపడమని చెప్పడం వరకూ ఓకే. మోడీ వేవ్ లేదనడం ఏంటని మండిపడుతున్నారు. ఆమె మాత్రం ఇది ఫేక్ వీడియో… తన స్పీచ్ ని ఎడిట్ చేసి… అతికించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అంటోంది. ఎన్సీపీ అయితే కౌర్ అన్నదాంట్లో తప్పేమీ లేదనీ… మోడీ వేవ్ లేదని బీజేపీకి కూడా తెలుసు. విపక్ష పార్టీల నేతలను చీల్చి తమ పార్టీలోకి చేర్చుకున్నప్పుడే బీజేపీకి ఆ సంగతి అర్థమైందని కామెంట్ చేస్తున్నారు.