స్టార్క్ కు నో ప్లేస్ కోల్ కతా రిటైన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ అవకాశం ఉండగా.. ఈ సారి మాత్రం ఫ్రాంచైజీలకు మేలు చేసేలా ఆరుగురికి అవకాశమిచ్చారు.

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 05:07 PM IST

ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ అవకాశం ఉండగా.. ఈ సారి మాత్రం ఫ్రాంచైజీలకు మేలు చేసేలా ఆరుగురికి అవకాశమిచ్చారు. దీంతో కొందరు స్టార్ ప్లేయర్స్ తమ పాత ఫ్రాంచైజీలతోనే కొనసాగడం ఖాయం. అదే సమయంలో మరికొందరు స్టార్ క్రికెటర్లు వేలంలోకి వస్తున్నారు. తాజాగా కోల్ కతా రిటైన్ జాబితాకు సంబంధించి ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సారి పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేయబోతున్నట్టు తెలుస్తోంది. 2023 మినీ ఆక్షన్ లో 24.75 కోట్లు పెట్టి కొన్న మిఛెల్ స్టార్క్ ను కోల్ కతా ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశాలు లేవని సమాచారం. 2024 సీజన్ లో స్టార్క్ బాగానే రాణించాడు. 17 వికెట్లతో కోల్ కతా టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తాము చాలా అధిక మొత్తంతో కొనుగోలు చేసినట్టు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పుడు ఫీల్ అవుతోంది. అందుకే ఈ సారి వేలంలోకి వదిలేసి అవకాశం ఉంటే తక్కువ ధరకే తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితాలో మొదటి ప్రాధాన్యతగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నే ఎంచుకోనుంది. దీని కోసం అతనికి 18 కోట్లు చెల్లించనుంది. అలాగే రెండో రిటెన్షన్ లో రింకూ సింగ్ ను 14 కోట్లకు కొనసాగించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. రింకూ గత సీజన్ లో పెద్దగా అవకాశాలు రాకున్నా ఫినిషర్ గా ఆ జట్టు కీలకం. అందుకే అతన్ని వదులుకునే పరిస్థితి లేదు. ఇక విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ను మూడో రిటెన్షన్ గా ఎంచుకునే అవకాశాలున్నాయి. రూల్స్ ప్రకారం రస్సెల్ కు 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నాలుగో రిటెన్షన్ గా ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ను కోల్ కతా తమతో పాటే కొనసాగించుకోవడం ఖాయం. నరైన ఇటు బాల్ తో పాటు బంతితోనూ అది కూడా ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. గత సీజన్ లో నరైన్ మూడు హాఫ్ సెంచరీలు, 180కి పైగా స్ట్రైక్ రేట్ తో 488 పరుగులు చేశాడు. స్పిన్నర్ గానూ అదరగొట్టిన నరైన్ 17 వికెట్లు పడగొట్టాడు.

మొత్తం మీద 18 కోట్ల కేటగిరీలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ , సునీల్ నరైన్ లనే కోల్ కతా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక యువ పేసర్ హర్షిత్ రాణాను కూడా నైట్ రైడర్స్ వదులుకునే అవకాశాలు లేవు. గత సీజన్ లో రాణా కోల్ కతా విజయాల్లో కీలకంగా ఉన్నాడు. 13 మ్యాచ్ లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. దీంతో హర్షిత్ రాణాను నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మిఛెల్ స్టార్క్ ను మళ్ళీ తీసుకునేందుకు ఎంతవరకూ బిడ్ వేస్తుందనేది తెలియాల్సి ఉంది. పైగా ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారా లేదా అనేది కూడా ఫ్రాంచైజీలకు ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు సీజన్లలో స్టార్క్ ఐపీఎల్ కంటే టెస్ట్ క్రికెట్ కే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే ఈ సారి ఆక్షన్ లో అమ్ముడయ్యాక ఐపీఎల్ ఆడకుంటే మాత్రం విదేశీ ఆటగాళ్ళపై రెండేళ్ళ నిషేధం విధించనున్నారు.

Retention 3 (Rs 11 crore) – Andre Russell
Retention 4: (Rs 18 crore) – Sunil Narine
Retention 5: (Rs 4 crore) (uncapped) -Harshit Rana
Rs 18 crore – Shreyas Iyer and Sunil Narine