మన దేశంలో ప్రధాని బియ్యం (Rice) లేదంటే గోధుమలు ఆహారం తీసుకుంటున్నాం. వీటిల్లో జింక్, ఐరన్ ఉంటుందని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. కానీ నిజంగా వీటిల్లో అసలు పోషకాలు ఉంటున్నాయా… అంటే అవేమీ లేవు… విషపూరితమైన ఆర్సెనిక్ (Arsenic rice) మాత్రం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు (Scientists).
రోజూ మనం తినే బియ్యం, గోధుమలు (wheat) విషంగా మారుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (Indian Council of Agricultural), (ICAR), డౌన్ టు ఎర్త్ అనే మేగజైన్ తో కలసి ఓ స్టడీ చేశారు. గత 50యేళ్ళల్లో భారత్ లో పండిస్తున్న బియ్యంలో జింక్ 30శాతం, ఐరన్ 27శాతం తగ్గిపోయాయి. అలాగే గోధుమల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీటికి బదులు విషతుల్యమైన ఆర్సెనిక్ మోతాదు 1.493 శాతం పెరిగినట్టు స్టడీస్ చెబుతున్నాయి. జింక్, ఐరన్ లాంటి పోషకాలు తగ్గిపోతుండటం… విషపదార్థాల శాతం పెరుగుతుండటం ఆందోళనకరమే అంటున్నారు పరిశోధకులు.
తక్కువ టైమ్ లో పంట చేతికి రావాలన్న ఉద్దేశ్యంతో హరిత విప్లవంలో భాగంగా కొన్ని కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దాని వల్ల భూమిలోని పోషకాలు ఆ పంటలకు అందడం లేదనేది పరిశోధకుల వాదన. అంటే మనం పంటలకు పోషకాలను తీసుకునే టైమ్ కూడా మనం ఇవ్వడం లేదు. అందుకే గోధుమలు, వరిలో మనిషికి కావాల్సిన ఐరన్, జింక్ పోషకాలు (Zinc nutrients) అందకుండా పోతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎరువులు, పురుగు మందుల వాడకం కూడా పెరిగింది. వీటివల్లే ప్రమాదకరమైన ఆర్సెనిక్ లాంటి విషపదార్థాలు చేరుతున్నట్టు గుర్తించారు.
పోషకాలు లేకపోతే ఏమవుతుంది?
మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవతే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో రోగాల బారిన పడతాం. జింక్, ఐరన్ లోపం వల్ల రక్తహీనత, ఎదుగుదల లోపం కనిపిస్తాయి. ఆర్సెనిక్ చేరడం వల్ల గుండె జబ్బులు (Heart diseases), క్యాన్సర్ (Cancer), డయాబెటీస్ (Diabetes), చర్మవ్యాధులు (Skin diseases) వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.