ASSEMBLY ELECTIONS: నామినేషన్ల గడువు ముగిసింది ! అన్ని పార్టీల్లోనూ భారీగా రెబల్స్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఓ అంకం ముగిసింది. 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడింటి దాకా క్యూలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. దాంతో BRS, Congress, BJP, BSPతో పాటు అన్ని పార్టీల్లోనూ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 04:39 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు గడువు ముగిసింది. చివరి రోజైన శుక్రవారం అన్ని పార్టీల్లోనూ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్, బీజేపీ ముందుగా ప్రకటించిన జాబితాల్లో కొన్ని మార్పులు చేయడంతో.. చాలా చోట్ల అసంతృప్తి చెలరేగింది. ఒకరి పేరు ప్రకటించి.. మరొకరికి బీఫామ్స్ ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో ఆందోళనలు తలెత్తాయి. అన్ని పార్టీల్లోనూ రెబల్‌గా ఇండిపెండెంట్స్ భారీగా నామినేషన్లు (REBELS NOMINATIONS) వేశారు. కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులపై దాడులు కూడా జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఓ అంకం ముగిసింది. 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడింటి దాకా క్యూలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.

Telangana Elections 2023: నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. సురేష్ షెట్కార్ స్థానంలో సంజీవ రెడ్డి

దాంతో BRS, Congress, BJP, BSPతో పాటు అన్ని పార్టీల్లోనూ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. BRS లిస్ట్‌ల ప్రకటన ఆగస్టులోనే పూర్తవడంతో.. ఆ పార్టీ అభ్యర్థులు ముందు నుంచే నామినేషన్లు వేశారు. అయితే గతంలో BRS అబ్యర్థుల అఫిడవిట్స్‌పై కోర్టుల్లో కేసులు నడిచాయి. దాంతో ఈసారి ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా పార్టీ ఆధ్వర్యంలో 20 మంది లాయర్లతో లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. దాంతో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్స్ పరిశీలించి.. ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొత్తగూడెం సీటును సీపీఐకు కేటాయించింది. బోధ్, నారాయణ్ ఖేడ్‌లో చివరి రోజు అభ్యర్థుల్లో మార్పులు జరిగాయి. అలాగే పటాన్ చెరులో ముందుగా ప్రకటించిన నీలం మధుకు కాకుండా శ్రీనివాస్‌కు బీఫామ్ ఇచ్చారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితాల విషయంలోనూ గందరగోళం తలెత్తింది. చివరి జాబితాను శుక్రవారం ప్రకటించింది బీజేపీ హైకమాండ్. మళ్ళీ జాబితాలో అభ్యర్థులు కాకుండా చివరి క్షణంలో మార్పులు చేశారు. దాంతో నామినేషన్ల చివరి రోజున బీజేపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ కనిపించింది.

సంగారెడ్డి, వేములవాడలో ప్రకటించిన వారికి కాకుండా వేరే వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్లు ఆశించి భంగపడినవాళ్ళు కూడా నామినేషన్లు వేశారు. దాంతో కమలం పార్టీకి ఈసారి ఎన్నికల్లో రెబల్స్ బాధ తప్పేలా లేదు. నామినేషన్లను ఈనెల 13న పరిశీలన చేస్తారు ఎన్నికల అధికారులు. అలాగే ఈనెల 15 వరకూ విత్ డ్రాకు అనుమతి ఉంటుంది. పోలింగ్ ఈ నెల 30న జరుగుతుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ నెల 15లోపు పార్టీల అధిష్టానాలు.. రెబల్ అభ్యర్థులను బతిమాలుకొని విత్ డ్రా చేయించే అవకాశాలు ఉన్నాయి.