Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వాళ్లుండరు. కరుడుగట్టిన నియంతృత్వానికి నిలువెత్తు రూపంగా కిమ్‌ను చూపిస్తుంటుంది ప్రపంచం. ఉత్తర కొరియాలో మానవ హక్కులు ఉండవని, ప్రజలపై తీవ్ర అమానుషాలకు పాల్పడుతుంటాడని, హత్యలు చేయిస్తాడని.. ఇలా రకరకాల ప్రచారాలున్నాయి కిమ్‌పై. అందుకే చాలా మంది కిమ్‌ను హృదయం లేనివాడిగా చెబుతుంటారు. అయితే, కిమ్‌కు కూడా మనసుంది. ఆ మనసులో ప్రేముంది.
Nithin-Naga Chaitanya: బాక్సాఫీస్ పోటీ.. నితిన్‌కు పోటీగా నాగ చైతన్య
కిమ్‌కు భార్య, పిల్లలు ఉన్నారని తెలిసిందే. కిమ్ భార్య పేరు రిసోల్. పిల్లలు ఎంతమంది అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, కిమ్ తన పదేళ్ల కూతురు జుయెను గత ఏడాది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. వీరి గురించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. బాహ్య ప్రపంచంలో కనిపించరు. కిమ్‌కు భార్యతోపాటు ఒక రహస్య ప్రేమికురాలు ఉంది. ఆమె పేరు హ్యొన్ సాంగ్ వోల్. ఈమె ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నారు. హ్యోన్ గతంలో ప్రీమియర్ గర్ల్ గ్రూప్, మెరన్ బాండ్ బ్యాండ్‌లో పని చేసి, బయటకి వచ్చారు. హ్యోన్, కిమ్ బంధం గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరి బంధం చాలా ప్రత్యేకమైందని, రహస్య బంధం ఉందని అక్కడి గూఢచారులు తెలిపారు. కిమ్, హ్యోన్ ప్రేమ బంధానికి గుర్తుగా.. ఒక బిడ్డ కూడా జన్మించినట్లు చెబుతున్నారు. బాబు పేరు ఇల్ బాంగ్ అని ప్రచారం జరుగుతోంది. కిమ్ భార్యకు పుట్టిన మొదటి కుమారుడు సన్నగా ఉండగా.. గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన కుమారుడు మాత్రం చాలా బలంగా ఉన్నాడట. ఇటీవల కిమ్, హ్యోన్ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. వీరిద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. కిమ్.. స్విట్జర్లాండ్‌లో చదువుకునేటప్పుడు అక్కడ తొలిసారి కలిశాడు.
ఆ తర్వాత కిమ్.. ఆమెను తన సోదరికి కేర్ టేకర్‌గా నియమించాడు. అనంతరం ఇద్దరూ ఉత్తర కొరియాకు తిరిగొచ్చిన తర్వాత వీరి బంధం బలపడింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారంటారు. అయితే, 2012లో వీరి ప్రేమ బంధాన్ని కిమ్ తండ్రి అంగీకరించలేదు. ఏమైనా కిమ్‌గాడి లవ్‌స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుర్మార్గుడు, నియంతగా పేరు ఉన్న కిమ్.. హ్యూన్‌సాంగ్‌ను ప్రేమలో ఎలా పడేసి ఉంటాడు.. భయపెట్టాడా, ఇంప్రెస్ చేశాడా అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు నెటిజన్లు. అసలు తన వృత్తిని వదిలేసుకొని వచ్చేంత ప్రేమను కిమ్‌లో హ్యూన్‌సాంగ్ ఏం చూసి ఉంటుందబ్బా అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.