Rajadhani Files : ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లోకే

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రాజధాని ఫైల్స్‌. దీని చుట్టూ వివాదాలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రాజధాని ఫైల్స్‌. దీని చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. హైకోర్టు (High Court) విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గత ఫిబ్రవరి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే వివాదాల నడుమ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. దీంతో ఓటీటీ (OTT) లో విడుదలైతే చూద్దామని ఎదురుచూస్తున్నారు.

అయితే మూడు రోజుల క్రితం ఈ రాజధాని ఫైల్స్‌ (Rajadhani Files) సినిమా సడన్‌గా యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఉచితంగా చూసేందుకు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మూవీ టీం ఇచ్చిన సడన్‌ సర్‌ప్రైజ్‌తో ఇప్పుడు ప్రేక్షకుడు ఫుల్‌ ఖుషీ అయిపోయారు. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని చూసేశారు. తెలుగువన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ సినిమా ప్రీగా ఇప్పుడు అందుబాటులో ఉంది.

భాను శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వినోద్‌ కుమార్‌ (Vinod Kumar), అమృత చౌదరి (Amrita Chaudhary), అఖిలన్‌ పుష్పరాజ్‌, వాణీ విశ్వనాథ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ఆపివేయడం అక్కడ భూములిచ్చిన రైతులు ఉద్యమ (Amaravati Farmers) బాట పట్టారు. ఆ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.