చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పటి మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… చేసిన కామెంట్స్ ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలో రివర్స్ కొడుతున్నాయి. X లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్… కవిత అరెస్ట్ పైనా స్పందిస్తున్నారు. ఈడీ, CBIలను కాంగ్రెస్ ఎలా దుర్వినియోగం చేస్తుందో చూడండి అంటూ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చేసిన కామెంట్స్… 2019లో NDA నుంచి బయటకెళ్ళాక చంద్రబాబు చేసిన ట్వీట్స్ ను రీట్వీట్ చేశారు కేటీఆర్. కానీ చంద్రబాబు అరెస్ట్ పై అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన కామెంట్స్, ట్వీట్స్ ని నెటిజెన్లు, టీడీపీ అభిమానులు మర్చిపోలేదు. అందుకే కేటీఆర్ ట్వీట్స్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబాలను బలిపశువులను చేయడానికి ఈడీ, CBI లాంటి సంస్థలను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ…. చంద్రబాబు X లో అప్పట్లో చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు కేటీఆర్. చంద్రబాబు కంటే బాగా చెప్పలేను… అని కామెంట్ చేశారు. అంతేకాదు… రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేంద్రం ఈడీ, CBI లను వాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు కేటీఆర్.
కేటీఆర్ ఇప్పుడు ప్రత్యేకంగా 2019 నాటి చంద్రబాబు ట్వీట్స్ ను రీట్వీట్ చేయడంతో.. నెటిజెన్స్ మండిపడుతున్నారు. కేటీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ కామెంట్స్… ట్వీట్స్ ని టీడీపీ ఫాలోవర్స్ అస్సలు మర్చిపోలేదు. బాబు అరెస్టయిన రోజు రాత్రి తాను ఓ కామెడీ షో చూశాననీ… బాగా ఎంజాయ్ చేశానంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ను ఉదహరిస్తూ నెటిజెన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. కవిత అరెస్ట్ ను ఉదహరిస్తూ… ఇప్పుడే జబర్డస్త్ షో చూశా… పొట్ట చక్కలయ్యేలా నవ్వా… మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళయిందో అని కామెంట్స్ పెట్టారు. కేటీఆర్ అప్పట్లో ఎలా ట్వీట్ చేశారో… సరిగ్గా అలాగే ట్వీట్స్ చేస్తున్నారు.
రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా కవిత అరెస్ట్ పై స్పందించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు, రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం… కవితను ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేశారు. మీరు కావాలంటే ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు చేసుకోండని కామెంట్ చేశారు. ధర్నాలు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ధర్నాలు చేస్తే అడ్డుకున్నారు కదా… ఇప్పుడు మీరెందుకు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు కోమటి రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్… ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి. X లో నెటిజెన్స్ మాజీ మంత్రిని ఓ ఆటాడుకుంటున్నారు.