Yasobhoomi : న్యూఢిల్లీలో మరో అద్భుత భవనం “యశోభూమి”

న్యూ ఢిల్లీలో మరో మణిహారం.. భారత్ మండపం తరహాలో యశోభూమి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారతీయ సంస్కృతికి పెద్దపీట వేసేలా "యశోభూమి" నిర్మాణం.

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో మరో అద్భుతమైన నిర్మాణం అందుబాటులోకి రానుంది. ఇటీవలే G20 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రభుత్వం భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్ భవనం నిర్మాణ రూపకల్పన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొంది నిర్మించింది.

ఇప్పుడు అదే తరహాలో ఆధునిక సౌకర్యాలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహించడానికి..భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనల కోసం సౌకర్యవంతం చేసేలా భారత ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీని నిర్మాణం దేశ రాజధానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.

“యశోభూమి”  ప్రత్యేకతలు..

  • ఢిల్లీలో మరో అధ్బుతం “యశోభూమి” భవనం.
  • యశోభూమి నిర్మాణ వ్యయం 4 వేల 400 కోట్లు.
  • ఇందులో ప్రధాన ఆడిటోరియంతో పాటు అనేక రకాల మీటింగ్‌ హాల్స్ ఉన్నాయి.
  • యశోభూమి మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్ రూమ్, 13 మీటింగ్ రూములున్నాయి.
  • మెయిన్ ఆడిటోరియంలో 6,000మంది కూర్చునే కెపాసిటీ ఉంది.
  • 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి.
  • కన్వెన్షన్ సెంటర్ ను సుమారు 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు.
  • 8 అంతస్తుల ఈ యశోభూమిలో.. ఏకకాలంలో 11వేల మంది కూర్చోవచ్చు.
  • వర్షం, మురుగు నీటిని శుద్ది చేసి వాడుకునేలా యంత్రాలను ఏర్పాటు చేశారు.
  • 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం (ప్లీనరీ హాల్) ను నిర్మించారు.
  • యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరిఫికేషన్ పొందింది.
  • సౌర విద్యుత్ కోసం రూప్ టాప్ సోలార్ ప్యానళ్లను బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు.

అందులో భాగంగా ద్వారక సెక్టార్ 25 మెట్రో స్టేషన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ నుంచి యశోభూమి ద్వారక సెక్టార్ 25కు వెళ్లేందుకు 21 నిమిషాలు పడుతుంది. రేపు సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించబోతున్నారు.

S.SURESH