హీరోయిన్ సమంతా వ్యక్తిగత జీవితంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై సినీ నటులు స్పందిస్తున్నారు వరుసగా. తాజాగా ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేసాడు. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ మండిపడ్డాడు. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి అని హితవు పలికాడు.
బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు అని హెచ్చరించాడు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతామన్నాడు. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదని హెచ్చరించాడు.కాగా ఎన్టీఆర్ కు సమంతాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు.