VIRAL VIDEO: మెడికల్ ఫీల్ఢ్ అంటేనే చాలా రెస్పెక్టబుల్, రెస్పాన్సిబిల్ ఫీల్డ్. మనుషుల రోగాన్ని నయం చేసి, ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లన్నా, నర్స్‌లన్నా ప్రతీ ఒక్కరూ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత డబ్బున్నవాడు ఐనా.. లేని వాడు ఐనా.. పరిస్థితి ప్రాణాల మీదకు వస్తే డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతాడు. అలాంటి వృత్తిలో ఉన్నవాళ్లు ఎంత బాధ్యతగా ఉండాలి. వాళ్ల పర్సనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. పేషెంట్లను ట్రీట్ చేసేటప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి కదా.
Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు
కానీ ఈ ముగ్గురు నర్సులు చేసిన పని తెలిస్తే మాత్రం తిట్టకుండా ఉండలేదు. కాస్త కోపం ఎక్కువ ఉన్నవాల్లు ఐతే కొట్టేస్తారు కూడా. ఇంతకీ వీల్లు ఏం చేశారు అంటే.. వాళ్లు డ్యూటీలో ఉన్న నర్స్‌లు అన్న సంగతి కూడా మర్చిపోయి రీల్స్ చేశారు. అది కూడా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లోపల. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్. దౌ కళ్యాణ్ సింగ్ ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో.. పుష్పా సాహు, త్రిప్తి దాసర్, తేజ్‌కుమారి ముగ్గురు స్టాఫ్ నర్స్‌గా వర్క్ చేస్తున్నారు. ముగ్గరూ కూడా కాంట్రాక్ట్ బేస్‌లో పని చేస్తున్న నర్సులే. కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి పోయినా పర్లేదు అనుకున్నారో ఏంటో.. రెగ్యులర్‌గా హాస్పిటల్‌లో ఇన్‌స్టా రీల్స్ చేసేవాల్లు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే చేశారు. ఆపరేషన్‌కు ఉపయోగించే కత్తులు, కత్తెర్లు, సూదులు పట్టుకుని వింత వింత చేష్టలు చేశారు. ఇలాంటి చేష్టలు చేసిన తరువాత ఆ రీల్ వైరల్ కాకుండా ఉంటుందా.. నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
ఆ ఫోన్ ఈ ఫోన్ తిరుగుతూ.. చివరికి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్‌కు వచ్చింది. అంతే వీళ్లు చేసిన పనికి ఆ సూపరింటెండెంట్ హేమంత్ శర్మ పిచ్చెక్కిపోయాడు. అసలు వార్నింగ్ కూడా లేకుండా ముగ్గురునీ సస్పెండ్ చేశాడు. రీల్స్ చేస్తే ఇంట్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్‌తో చేయాలి అనిపిస్తే రోడ్లపై చేసుకోవాలి. అంతేకానీ హాస్పిటల్‌లో.. అది కూడా ఆపరేషన్ థియేటర్‌లో చేయడమేంటని మండిపడుతున్నారు ఈ న్యూస్ విన్న నెటిజన్లు. ఇలాంటి వాళ్ల వల్ల మెడికల్ ఫీల్డ్‌కు ఉన్న మర్యాద పోతుదని తిట్టిపోస్తున్నారు. వైరల్ అవ్వాలని హాస్పిటల్‌లో రీల్స్ చేసి జాబ్‌లెస్ అయ్యారు ఈ ముగ్గురు నర్సులు.