BC Senses: దేశంలో జనగణన చేసేందుకు క్యూ కడుతున్న రాష్ట్రాలు.. మరి రాజకీయ నాయకుల వాదనలేంటి..?

తాజాగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్ సభ ఎన్నికల కంటే ముందే సామాజిక వర్గాల వారిగా జనగణను ప్రకటించాలన్నారు.

  • Written By:
  • Publish Date - October 5, 2023 / 04:07 PM IST

ఈమధ్య కాలంలో బీసీ వాదనలు ఎక్కువగా వినిసిస్తున్నాయి. ఇటు తెలంగాణలోనే కాకుండా మరి కొన్ని రాష్ట్రాల్లో దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. మన్నటికి మన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనగణన చేసి తమ రాష్ట్రంలో 63 శాతం ఈబీసీ, ఓబీసీ జనాభా ఉన్నారని ప్రకటించారు. దీంతో మరిన్ని రాష్ట్రాలు ముందుకు కదిలాయి. తాజాగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్ సభ ఎన్నికల కంటే ముందే సామాజిక వర్గాల వారిగా జనగణను ప్రకటించాలన్నారు. అందులో భాగంగా ముందు వెనుకబడిన వర్గాల జనాభా గణన చేసేందుకు పూనుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాల ప్రభావంతో దేశం మొత్తం పడే ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక ఇదిలా ఉంటే అస్సాంలో ప్రత్యేకంగా కేవలం మైనారిటీ వర్గాల జనాభాను మాత్రమే లెక్కగడుతున్నారు.

కేంద్రం ఆలోచన ఇలా..

గతంలో మహిళా బిల్లులను ప్రవేశ పెట్టే క్రమంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు ప్రతిపక్ష సభ్యులు. దీనిపై దేశ ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీనిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ కార్గే. బీసీలను జనగణన చేస్తే వారికి దేశ వ్యాప్తంగా ఉన్న సీట్లలో తగు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తమకు ఎన్నికల వేళ సరైన నిధుల సమస్య, గెలుపొందే అభ్యర్థుల కొరత ఏర్పాడుతున్నాట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే జరిగితే తన మంత్రి వర్గాన్ని కూడా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవుల్లో సగం కంటే తక్కువ బీసీలు కొనసాగుతున్నారు. ఇలా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక సామాజిక వర్గాన్ని లెక్కించడం ఇబ్బందిగా భావించి ఈ ప్రయత్నాన్ని దాటవేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ ఏమంటోంది..

దేశంలోని ప్రజల సామాజిక వర్గాల గణన జరిగితే ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో సులువుగా అర్థమౌతుంది. వారికి అవసరాలను, చేకూర్చే ప్రయోజనాలను త్వరగా అంచనా వేయవచ్చు. వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించ వచ్చు. నిజంగా జన గణన జరిగితే ఎంతమంది వెనుకబడి ఉన్నారు. నిరక్ష్యరాసులు ఎంతమంది, విద్యావంతులు, మేధావులు ఎందరు అనే అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి సరైన సౌకర్యాలు చేపట్టేందుకు మార్గం సులభతరం అవుతుందని భావిస్తోంది కాంగ్రెస్. ఈ విషయాలను మల్లిఖార్జున్ కార్గే కాంగ్రెస్ సిద్దాంతాలుగా చెబుతూ బీజేపీ పై మండిపడ్డారు.

T.V.SRIKAR