Afghanistan: అఫ్గాన్ లో రికార్డ్ స్థాయిలో భూకంపం..2000 మంది మృతి.. ఇంకా శిథిలాల క్రింద చిక్కకున్న ప్రజలు

అప్ఘానిస్తాన్ గతంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో భూకంపం నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ప్రభుత్వ ప్రతినిథులు.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 02:27 PM IST

అఫ్గానిస్థాన్ లో శనివారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం తీవ్ర విపత్కర పరిస్థితులకు దారితీస్తోంది. పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా రికార్డ్ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పొయిన వారి సంఖ్య గణనీయంగా 2000 లకు చేరింది. భారీ స్థాయిలో భూమి కంపించడం వల్ల వేల ఇళ్లు నేలకూలాయి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా నేలమట్టమయ్యాయి. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి రెస్కూ టీం. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి.

పూర్తిగా దెబ్బతిన్న కమ్యూనికేషన్..

పశ్చిమ ప్రాంతంలోనే ప్రదానంగా ఏడు సార్లు భూమి కంపించడంతో తీవ్ర స్థాయిలో ఆస్తి సహా ప్రాణ నష్టం సంభవించింది. 400 ఇల్లు పూర్తి స్థాయిలో పడిపోగా, 150 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఈ పెను ప్రమాదంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. మొత్తం ఏడు భూకంపాల్లో ఐదు తీవ్ర స్థాయిలో నమోదైనట్లు తాలిబన్ల అధికారులు వెల్లడించారు. ఇలాంటి భూకంపం ఇప్పటి వరకూ ఎన్నడూ చూడలేదంటున్నారు బాధితులు. నిరాశ్రయులై సరైన తిండి లభించక ఆకలితో అలమటిస్తున్నారు. శిథిలాల క్రింద ఇంకా వేల సంఖ్యలో చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

గతం కంటే అధికంగా మరణాలు..

2022లో ఇదే స్థాయిలో భూకంపం సంభవించినట్లు అప్పటి లెక్కలు చెబుతున్నాయి. అయితే అప్పుడు కేవలం 1000 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 1500 మంది గాయపడ్డట్లు అప్పటి రికార్డుల్లో పొందుపరిచారు. దీని ప్రభావం నేపాల్ పై కూడా పడినట్లు కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంత జిల్లాగా పిలువబడే బఝంగ్ లోనూ శనివారం భూమి కంపించడం మొదలైంది. ఒకసారి కంపించిన తరువాత నిమిషాల వ్యవధిలో మరోసారి భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళలనతో రోడ్డుపైకి పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.

T.V.SRIKAR