Tirumala Temple: శ్రీవారి ఆలయంలో పడిపోయిన హుండీ.. ఇదేం అపశృతి.. భక్తుల్లో భయంభయం..

తిరుమలలో ఘటనలు వరుసగా చర్చకు కారణం అవుతున్నాయ్. మొన్న తిరుమలలో శిలువ గుర్తు ముద్రించి ఉన్న టీ కప్పులు విక్రయించిన ఘటన మర్చిపోక ముందే.. శ్రీవారి ఆలయంపై నుంచి విమానం సంచరించడం చర్చకు దారి తీసింది.

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 02:00 PM IST

ఇవి మర్చిపోకముందే.. తిరుమల ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. గుడిలో హుండీ కిందపడింది. పరకామణికి హుండీని తరలిస్తున్న సమయంలో.. ఆలయ మహాద్వారం దగ్గర హుండీ కిందపడిపోయింది. కొన్ని కానుకలు బయటపడ్డాయ్. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. కిందపడిన కానుకలకు మూట కట్టి.. ఆ తర్వాత లారీలో హుండీతో కలిపి తీసుకెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత.. ఆలయం వెలుపలికి తీసుకువచ్చి లారీలో కొత్త పరకామణికి తీసుకువెళ్తారు.

ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో.. ఆలయం వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటుంటారు. డబ్బులు, బంగారం, ఇతర వస్తువల రూపంలో భక్తులు కాసులు సమర్పిస్తారు. ఇలా ప్రతి రోజు శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీవారి హుండీని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అపశృతి దేనికి సంకేతం అని వణికిపోతున్నారు.